
భారతదేశంలో ఉద్యోగస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందువల్ల ప్రతి ఏడాది ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపు అనేది సగటు ఉద్యోగి బాధ్యతగా ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌కమ్ ట్యాక్స్‌ను సేవ్ చేసేందుకు పెట్టుబడి అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే 2021-22 సంవత్సరానికి సంబంధించిన 2020-21 ఆర్థికి సంవత్సరానికి ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు తాజాగా ఆదాయపు పన్ను శాఖ షాక్ ఇచ్చింది. ఆ ఏడాది అందించిన వివరాల్లో నిర్ధిష్ట అధిక-విలువ ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా వివరాల తనిఖీల్లో అసమతుల్యత కనుగొన్న ఖాతాదారులకు నోటీసులు పంపుతుంది. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ నోటీసుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
“ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లకు సంబంధించి ఐటీఆర్‌లో పేర్కొన్న ఆర్థిక లావాదేవీల సమాచారం ‘అసమతుల్యత’ గుర్తించామని ఐటీ అధికారులు పేర్కొంటున్నారు. ఏవై 2021-22 కోసం ఐటీఆర్‌లు దాఖలు చేయని సందర్భాల్లో, నిర్దిష్ట అధిక-విలువ ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని డిపార్ట్‌మెంట్ ఆధీనంలో ఉంచుకుంటే దానిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ-ధృవీకరణ పథకం-2021లో భాగంగా ఏవై 2021-22 (ఎఫ్‌వై2020-21)కి సంబంధించిన సమాచారంలో అసమతుల్యత కోసం పన్ను చెల్లింపుదారులకు కమ్యూనికేషన్ ను పంపే ప్రక్రియలో ఉందని పేర్కొంటున్నారు. ఈ సమాచారం ఆదాయపు పన్ను శాఖలో రిజిస్టర్ అయినట్లుగా పన్ను చెల్లింపుదారులకు వారి ఈ-మెయిల్ ఖాతాలకు మెయిల్ చేస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక సమాచార ప్రకటన (ఏఐఎస్)ను ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా చూడాలని, అవసరమైన చోట అప్‌డేట్ చేసిన ఐటీఆర్‌లను (ఐటీఆర్-యూ) ఫైల్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. అర్హత ఉన్న నాన్-ఫైలర్లు ఆదాయపు పన్ను చట్టం, 1961కు సంబంధించిన అప్‌డేట్ చేసిన రిటర్న్‌లను (ఐటీఆర్-యూ) యూ/ఎస్ 139(8ఏ) కూడా సమర్పించవచ్చని పేర్కొంది.
ఏవై 2021-22కి (అంటే ఎఫ్‌వై2020-21కి) అప్‌డేట్ చేసిన రిటర్న్‌ల (ఐటీఆర్-యూ) ఫైల్ చేయడానికి చివరి తేదీ మార్చి 31, 2024గా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఐటీ చట్టంలోని సెక్షన్ 115 బీఏసీ ప్రకారం కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ఇచ్చింది. కొత్త ఐటీ స్లాబ్‌లు పన్ను ప్రయోజనం కోసం మొత్తం ఆదాయాన్ని గణించేటప్పుడు నిర్దిష్ట నిర్దిష్ట తగ్గింపులు లేదా మినహాయింపులను పొందని లేదా ఉపసంహరించుకోని వ్యక్తుల కోసం ఇది అందుబాటులో ఉంది. దీని కింద రూ.2.5 లక్షల వరకు వార్షిక ఆదాయం పన్ను నుంచి మినహాయించారు. రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులు 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 నుంచి 7.5 లక్షల మధ్య ఆదాయానికి 10 శాతం, రూ.7.5 నుంచి 10 లక్షల మధ్య ఉన్న వారికి 15 శాతం పన్ను విధించారు. రూ.10 నుంచి 12.5 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు 20 శాతం పన్ను చెల్లించగా, రూ.12.5 నుంచి రూ.15 లక్షల మధ్య ఉన్నవారు 25 శాతం చొప్పున చెల్లించారు. 15 లక్షలకు పైబడిన ఆదాయంపై 30 శాతం పన్ను విధించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి