Jeff Bezos Ex Wife : మళ్లీ పెళ్లి చేసుకున్న అమెజాన్‌ వ్యవస్థాపకుడి మాజీ భార్య.. సైన్స్ టీచర్‌ను వివాహమాడిన మెకంజీ..

|

Mar 09, 2021 | 10:23 AM

Jeff Bezos Ex Wife: ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలుగా గుర్తింపు పొందిన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య మెకెంజీ స్కాట్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వాషింగ్టన్‌లోని సీటెల్‌కు చెందిన

Jeff Bezos Ex Wife : మళ్లీ పెళ్లి చేసుకున్న అమెజాన్‌ వ్యవస్థాపకుడి మాజీ భార్య.. సైన్స్ టీచర్‌ను వివాహమాడిన మెకంజీ..
Follow us on

Jeff Bezos Ex Wife: ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలుగా గుర్తింపు పొందిన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య మెకెంజీ స్కాట్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వాషింగ్టన్‌లోని సీటెల్‌కు చెందిన సైన్స్‌ టీచర్‌ డాన్‌ జీవెట్‌ను ఆమె వివాహమాడారు. ఈ విషయాన్ని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. అదే విధంగా జెవెట్‌ సైతం మెకాంజీకి సంబంధించిన వెబ్‌సైట్(ప్లెడ్జ్‌ పేజీ)‌ ద్వారా ధ్రువీకరించారు. ఈ మేరకు.. ‘‘అత్యంత దయనీయురాలు, కరుణామూర్తి అయిన మహిళను నేను పెళ్లి చేసుకున్నాను. అంతేకాదు, సంపద దానం చేసే విషయంలో తను ఎంతో నిబద్ధతగా నెరవేరుస్తున్న బాధ్యతల్లో భాగం కాబోతున్నాను’’ అంటూ పేర్కొన్నారు.

ఇక మెకాంజీ స్కాట్‌, ప్రపంచ కుబేరుడు, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెకాంజీ రెండో వివాహంపై స్పందించిన ఆయన.. ‘‘డాన్‌ చాలా గొప్ప మనసు ఉన్న వ్యక్తి. వాళ్లిద్దరు తీసుకున్న నిర్ణయం పై నాకెంతో సంతోషంగా ఉంది’’ అంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇక 25 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ బెజోస్‌- మెకాంజీ 2019లో సంయుక్త ప్రకటన చేశారు. భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతామన్న బెజోస్‌.. ఉమ్మడి వెంచర్లు, ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా కొనసాగుతామని స్పష్టం చేశారు.

50 ఏళ్ల స్కాట్‌ 53 బిలియన్‌ డాలర్ల సంపదతో ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన వ్యక్తుల జాబితాలో 22వ స్థానంలో ఉన్నారు. జెఫ్‌ను పెళ్లి చేసుకున్న ఆమె 25 ఏళ్ల తర్వాత 2019లో విడాకులు తీసుకున్నారు. విడిపోయాక స్కాట్‌కు అమెజాన్‌ నుంచి 38 బిలియన్‌ డాలర్ల షేర్లు లభించాయి. ఆమెకు అమెజాన్‌లో ఇప్పుడు 4 శాతం వాటా కూడా ఉంది. కొవిడ్‌ సహాయక చర్యల్లో భాగంగా స్కాట్‌ గత ఏడాది పలు ఆహార పంపిణీ కేంద్రాలు, అత్యవసర సహాయ నిధి కింద 4.1 బిలియన్‌ డాలర్ల విరాళాన్ని అందించారు. గొప్ప మానవతావాది అయిన స్కాట్ బిలియన్ల కొద్దీ డాలర్లను విరాళంగా అందిస్తూ వస్తున్నారు. జాతి సమానత్వం, స్వలింగ సంపర్కుల హక్కులు, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం గత ఏడాది స్కాట్‌ 1.7 బిలియన్‌ డాలర్ల విరాళాన్ని ఇచ్చారు.

ONEPLUS-9 : మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్.. వచ్చేస్తుంది వన్‌ప్లస్ 9 సిరీస్.. మార్కెట్లో ఎప్పటి నుంచి దొరుకుతుందంటే..?