మందుల కొరత తప్పదా? LPG సంక్షోభంతో ఆ మెడిసిన్స్‌ దొరుకుడు కష్టమే!

దేశవ్యాప్తంగా తలెత్తిన ఎల్‌పీజీ (LPG) సంక్షోభం ఫార్మా రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఔషధాల తయారీ ప్రక్రియలో, ముఖ్యంగా ముడి పదార్థాలను వేడి చేయడాని, యంత్రాలను నడపడానికి గ్యాస్ ఒక కీలకమైన ఇంధనం. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, అనేక ఫార్మా కంపెనీల వద్ద కేవలం 10 రోజులకు సరిపడా స్టాక్ మాత్రమే మిగిలి ఉంది. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే, మార్కెట్‌లో ఈ మందుల కొరత ఏర్పడటమే కాకుండా, వాటి ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా అత్యధిక మంది ప్రజలకు అవసరమైన మందుల సరఫరాపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

మందుల కొరత తప్పదా? LPG సంక్షోభంతో ఆ మెడిసిన్స్‌ దొరుకుడు కష్టమే!
Pharma Industry Crisis

Updated on: Mar 19, 2026 | 12:40 PM

దేశంలో ఎల్‌పీజీ (LPG) గ్యాస్ కొరత ఇప్పుడు సామాన్యుడి వంటగదికే పరిమితం కాకుండా, ప్రాణరక్షక మందుల తయారీని కూడా దెబ్బతీస్తోంది. గ్యాస్ సరఫరాలో ఏర్పడిన సంక్షోభం కారణంగా ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తిని కొనసాగించలేక సతమతమవుతున్నాయి. ఔషధాల తయారీలో బాయిలర్లు, ఇతర యంత్రాలను నడపడానికి భారీ మొత్తంలో గ్యాస్ అవసరమవుతుంది. ముఖ్యంగా మందుల మిశ్రమాన్ని వేడి చేయడం, స్టెరిలైజేషన్, డ్రైయింగ్ ప్రక్రియ వంటి వాటికి ఎల్‌పీజీ అత్యవసరం. ప్రస్తుత గ్యాస్ కొరత వల్ల దేశంలోని ప్రధాన ఫార్మా హబ్‌లలో ఉత్పత్తి 30-40శాతం వరకు పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ప్రమాదంలో నిత్యావసర మందులు:

ఈ సంక్షోభం వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే మందులు:

ఇవి కూడా చదవండి

పారాసిటమాల్: జ్వరం, నొప్పుల కోసం ప్రతి ఇంట్లో వాడే ఈ మందు ఉత్పత్తికి విఘాతం కలిగింది.

డయాబెటిక్ మెడిసిన్: షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ వాడే ఇన్సులిన్, ఇతర ట్యాబ్లెట్ల సరఫరాలో అంతరాయం కలగవచ్చు.

యాంటీ బయాటిక్స్: ఇన్ఫెక్షన్ల నివారణకు వాడే కీలకమైన మందుల తయారీ కూడా నిలిచిపోయింది.

కేవలం 10 రోజుల నిల్వలు:

చాలా కంపెనీల వద్ద ప్రస్తుతం ఉన్న ముడి పదార్థాలు, ఇంధన నిల్వలు కేవలం 10 రోజులకు మాత్రమే సరిపోతాయి. కొత్తగా గ్యాస్ సిలిండర్ల సరఫరా జరగకపోతే, వచ్చే వారం నుండి ఫార్మా యూనిట్లు మూతపడే అవకాశం ఉంది. దీనివల్ల మెడికల్ షాపుల్లో మందుల కొరత ఏర్పడి, రోగులు ఇబ్బందులు పడటమే కాకుండా, బ్లాక్ మార్కెట్ పెరిగే ప్రమాదం కూడా ఉంది.

ప్రభుత్వ జోక్యం అవసరం:

ఫార్మా అసోసియేషన్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. నిత్యావసర సేవల కింద ఫార్మా రంగానికి ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సరఫరా చేయాలని వారు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ఈ అంశంపై ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే వైద్య రంగంలో పెను సంక్షోభం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us