LPG Gas Price: గ్యాస్‌ వినియోగదారులకు ముఖ్య అలర్ట్.. ఇకపై 12 సిలిండర్లపై సబ్సిడీ ఎంతో తెలుసా?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 2024 నుండి మార్చి 2025 వరకు కోట్లాది మంది ప్రజలు ఎల్‌పీజీ సిలిండర్‌లపై సబ్సిడీని పొందుతారు. ఈ సబ్సిడీ రూ.300. దీని ప్రయోజనం 12 సిలిండర్లపై మాత్రమే అందుబాటులో ఉంటుంది. దాని ప్రయోజనాలను పొందేందుకు ఉజ్వల స్కీమ్‌కు కనెక్ట్ చేయడం తప్పనిసరి. ఉజ్వల పథకం కింద 9 కోట్ల మందికి పైగా కనెక్ట్ అయ్యారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

LPG Gas Price: గ్యాస్‌ వినియోగదారులకు ముఖ్య అలర్ట్.. ఇకపై 12 సిలిండర్లపై సబ్సిడీ ఎంతో తెలుసా?
Lpg Gas

Updated on: Apr 13, 2024 | 4:15 PM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 2024 నుండి మార్చి 2025 వరకు కోట్లాది మంది ప్రజలు ఎల్‌పీజీ సిలిండర్‌లపై సబ్సిడీని పొందుతారు. ఈ సబ్సిడీ రూ.300. దీని ప్రయోజనం 12 సిలిండర్లపై మాత్రమే అందుబాటులో ఉంటుంది. దాని ప్రయోజనాలను పొందేందుకు ఉజ్వల స్కీమ్‌కు కనెక్ట్ చేయడం తప్పనిసరి. ఉజ్వల పథకం కింద 9 కోట్ల మందికి పైగా కనెక్ట్ అయ్యారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

వాస్తవానికి ఉజ్వల పథకం కింద పేద మహిళలకు సిలిండర్‌పై రూ.300 సబ్సిడీని పెంచుతున్నట్లు గత మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సబ్సిడీ ఇంతకుముందు మార్చి 2024 వరకు ఉంది. ఇప్పుడు అది మార్చి 31, 2025 వరకు పొడిగించింది. సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

మీకు సబ్సిడీ ఎప్పటి నుంచి అందుతోంది?

ఇంధన ధరల పెరుగుదల కారణంగా కేంద్ర ప్రభుత్వం 2022 మేలో ఉజ్వల పథకం లబ్ధిదారులకు సిలిండర్‌పై రూ.200 సబ్సిడీని అందించింది. ఇది అక్టోబర్ 2023లో రూ.300కి పెరిగింది. ఈ సబ్సిడీ సంవత్సరానికి 12 ఎల్‌పీజీ సిలిండర్లపై లభిస్తుంది. ఈ చర్యతో దాదాపు 10 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని అంచనా. ఇందుకు రూ.12,000 కోట్లు ఖర్చవుతుంది.

2016లో ప్రారంభం

గ్రామీణ, అణగారిన పేద కుటుంబాలకు స్వచ్ఛమైన వంట ఇంధనం లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి) అందించడానికి వయోజన మహిళలకు ఎటువంటి డిపాజిట్ లేకుండా ఎల్‌పిజి కనెక్షన్‌లను అందించడానికి ప్రభుత్వం మే, 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (ఎల్‌పిజి)ని ప్రారంభించింది. పేద కుటుంబాల పీఎంయూవై ప్రారంభించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి