Gas Cylinder Booking: వినియోగదారులకు గుడ్ న్యూస్.. సిలిండర్ పై రూ.800 వరకు తగ్గింపు.!! ఎలాగంటే.!

|

May 11, 2021 | 9:16 AM

Gas Cylinder Booking: అసలే కరోనా కాలం.. ఆపై పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుల పాలిట గుదిబండలా మారిన సంగతి తెలిసిందే...

Gas Cylinder Booking: వినియోగదారులకు గుడ్ న్యూస్.. సిలిండర్ పై రూ.800 వరకు తగ్గింపు.!! ఎలాగంటే.!
Lpg Gas Cylinder
Follow us on

Gas Cylinder Booking: అసలే కరోనా కాలం.. ఆపై పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుల పాలిట గుదిబండలా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 861 ఉంది. ఇలాంటి తరుణంలో వినియోగదారులకు పేటీఎం సంస్థ గుడ్ న్యూస్ అందించింది. గ్యాస్ బుకింగ్‌పై భారీ క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. రూ. 800 వరకు క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే ఈ ఆఫర్ ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా మొదటిసారి పేటీఎం ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకున్నవారికే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఆఫర్‌ను వినియోగించుకునేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి…

  • మొదటిగా పేటీఎం యాప్ ఓపెన్ చేయాలి
  • అనంతరం ‘Recharge And Pay Bills’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
  • ఆ తర్వాత ‘Book A Cylinder’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
  • నెక్స్ట్ మీ గ్యాస్ ప్రొవైడర్‌ను ఎంచుకుని వివరాలను నమోదు చేయండి
  • అనంతరం ‘Proceed to Pay’ ఆప్షన్‌పై క్లిక్ చేసి బిల్ చెల్లించాలి.
  • ఇలా మొదటిసారి పేటీఎం ద్వారా గ్యాస్ బుకింగ్ చేసినవారికి అటోమేటిక్‌గా ఆఫర్ వర్తిస్తుంది
  • చివరిగా గ్యాస్ బుకింగ్ అనంతరం స్క్రాచ్ కార్డు వస్తుంది.
  • దానిని ఓపెన్ చేస్తే రూ. 10 నుంచి రూ.800 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు
  • ఈ స్క్రాచ్ కార్డును 7 రోజుల్లోగా వినియోగించుకోవాలి.

Also Read:

హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?

ఐపీఎల్ వాయిదా.. పలు ఫ్రాంచైజీలకు లాభం.. ఆ ఐదుగురు ప్లేయర్ల పునరాగమనం.!

Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..!

భారీ నాగపామును పట్టి బరాబరా ఈడ్చుకెళ్లిన బామ్మ.. నెటిజన్లు ఫిదా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!