గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలు విడుదల..! గత నెలతో పోల్చితే తగ్గుదల.. ఏడాదికి 12 సిలిండర్లకు మాత్రమే..!

|

May 01, 2021 | 2:38 PM

LPG Cylinder Price Revised : మే మొదటి తేదీన చమురు కంపెనీలు ఎల్‌పిజి కొత్త ధరలను విడుదల చేశాయి. వివాహ సీజన్లో వాణిజ్య గ్యాస్

గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలు విడుదల..! గత నెలతో పోల్చితే తగ్గుదల.. ఏడాదికి 12 సిలిండర్లకు మాత్రమే..!
Lpg
Follow us on

LPG Cylinder Price Revised : మే మొదటి తేదీన చమురు కంపెనీలు ఎల్‌పిజి కొత్త ధరలను విడుదల చేశాయి. వివాహ సీజన్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర తగ్గింది. అయితే 14.2 కిలోల బరువున్న గృహాల్లో ఉపయోగించే ఎల్‌పిజి ధరలో ఎటువంటి మార్పు లేదు. వాణిజ్య సిలిండర్ల ధరను రాజధాని ఢిల్లీలో 46 రూపాయలు తగ్గించారు. ఢిల్లీలో మొదట19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర 1641.50 రూపాయలు. ఇది ఇప్పుడు 1595.50 రూపాయలకు పడిపోయింది. కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి. అంతకుముందు వరుసగా ఫిబ్రవరి, మార్చి , ఏప్రిల్‌ నెలలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను పెంచారు. వరుసగా మూడు నెలల పెరుగుదల తరువాత మేలో తగ్గించారు.

ఇళ్లలో ఉపయోగించే 14 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. ఢిల్లీలో ఒక ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ ధర 809 రూపాయలు మాత్రమే. అదేవిధంగా కోల్‌కతాలో ఇది రూ.835, ముంబైలో రూ.809, చెన్నైలో రూ.825గా నిర్ణయించారు. అంతకుముందు ఏప్రిల్ నెలలో ఎల్‌పిజి ధరను తగ్గించారు. గ్యాస్ ధర తగ్గడానికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పు సంభవించడమే. ప్రతి సంవత్సరం14.2 కిలోల 12 ఎల్‌పిజి సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఒక కస్టమర్ దీని కంటే ఎక్కువ సిలిండర్లు తీసుకోవాలనుకుంటే తదుపరి సిలిండర్‌పై పూర్తి డబ్బు చెల్లించాలి. వీటిపై ప్రభుత్వం నుంచి మినహాయింపు ఇవ్వబడదు. గ్యాస్ సిలిండర్ల ధర అంతర్జాతీయ బెంచ్ మార్క్, కరెన్సీ మార్పిడి రేటుపై కూడా ఆధారపడి ఉంటుంది.

Corona Vaccine: కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ v వ్యాక్సిన్ల మధ్యగల తేడాలు, పోలికలు ఎంటో తెలుసా.. నిపుణుల సూచనలు..

Etela Rajender: మంత్రి ఈటల రాజేందర్‌ వేటుకు రంగం సిద్ధం.. వైద్య ఆరోగ్యశాఖను కేసీఆర్‌కు బదిలీకి గవర్నర్‌ ఆమోదం

కొవిడ్ లక్షణాలలో ఆ రెండు చాలా డేంజరట..! కోలుకోవడానికి చాలా సమయం పడుతుందట..? తెలుసుకోండి..