Electric Scooter: కేవలం రూ. 38,000కే ఎలక్ట్రిక్ స్కూటర్.. లోకల్ అవసరాలకు ఇదే బెస్ట్..

లోకల్ అవసరాల కోసం మంచి బైక్ కోసం ఎదురుచూస్తున్నారా? సిటీ పరిధిలో ఇబ్బంది లేకుండా ప్రయాణించడానికి అవసరమైన వాహనం కోసం కోసం వెతుకుతున్నారా? అయితే మీకో బెస్ట్ ఆప్షన్ ఉంది. అది కూడా అతి తక్కువ ధరలోనే. వివరాలు కోసం ఇది చదవండి..

Electric Scooter: కేవలం రూ. 38,000కే ఎలక్ట్రిక్ స్కూటర్.. లోకల్ అవసరాలకు ఇదే బెస్ట్..
Oreva Electric

Updated on: Apr 13, 2023 | 3:27 PM

లోకల్ అవసరాల కోసం మంచి బైక్ కోసం ఎదురుచూస్తున్నారా? సిటీ పరిధిలో ఇబ్బంది లేకుండా ప్రయాణించడానికి అవసరమైన వాహనం కోసం కోసం వెతుకుతున్నారా? అయితే మీకో బెస్ట్ ఆప్షన్ ఉంది. అది కూడా అతి తక్కువ ధరలోనే. ఒరేవా ఎలక్ట్రిక్ లోస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. దాని పేరు ఒరేవా ఆదిదేవ్(Oreva Adidev) ఎలక్రిక్ స్కూటర్. మన దేశీయ రోడ్లకు చక్కగా సరిపోయే ఈ స్కూటర్ లో బడ్జెట్లో నే లభ్యమవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

డిజైన్, లుక్.. చిన్నగా క్యూట్ గా కనిపిస్తున్న ఈ స్కూటర్ పై ఇద్దరు ప్రయాణించగలుతారు. అందుకు తగిన సీటింగ్ ఇచ్చారు. ముందు వైపు నుంచి చూస్తే కాస్త స్కూటీ పెప్ ప్లస్ లుక్ లో కనిపిస్తుంది. ఈ స్కూటర్ ఎత్తు 1030ఎంఎం ఉంటుంది. పొడవదు 1750ఎంఎం, వెడల్పు 670ఎంఎం ఉంటుంది. ఈ స్కూటర్ బరువు 75 కేజీలు. 10 లీటర్ సామర్థ్యంతో స్టోరేజ్ బాక్స్ సీటు కింద ఉంటుంది. అధిక సామర్థ్యం కలిగిన ప్లాస్టిక్ తో దీనిని తయారు చేశారు.

కలర్ ఆప్షన్స్.. ఒరేవా ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభ్యమవుతుంది. బ్లూ, రెడ్. ఛాసిస్ మాత్రం రెండింటికీ బ్లాక్ కలర్ లోనే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సామర్థ్యం.. దీనిలోని మోటార్ 500వాట్స్ సామర్థ్యంతో ఉంటుంది. బ్యాటరీ 48V, 24Ah సామర్థ్యంతో ఉంటుంది. గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలుతుంది. నైలాన్ లో తయారైన ట్యూబ్లను టైర్లలో వాడారు. డిజిటల్ మీటర్ ఉంటుంది.

ధర.. ఒరేవా ఆదిదేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 38,000(ఎక్స్ షోరూం)గా ఉంది.

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..