వ్యాపారం చేయాలని చాలా మంది కోరుకుంటారు. ఇందుకోసం ప్రణాళికలు రచించుకుంటారు. అందుకు అనుగుణంగా పెట్టుబడి పెడుతుంటారు. అయితే వ్యాపారం అనగానే చాలా మంది పెట్టుబడికి భయపడి వెనుకడుగు వేస్తుంటారు. అయితే సరైన ఆలోచన ఉండాలే కానీ పెట్టుబడితో సంబంధం లేకుండా మంచి లాభాలు ఆర్జించవచ్చు. అలాంటి ఎన్నో వినూత్నమైన ఆలోచనలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కరెంట్ వైర్లలో ఉండే కాపర్ (రాగిని) వేరు చేసి విక్రయించడమే ఈ బిజినెస్ ముఖ్య ఉద్దేశం. ఈ వ్యాపారం ప్రారంభించాలంటే వైర్ స్ట్రిప్పింగ్ మిషిన్ కావాల్సి ఉంటుంది. ఈ మిషిన్ రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఉంటాయి. అనంతరం ఇక మనకు కావాల్సింది వాడి పడేసిన వైర్లు. ఇంతకీ వైర్లు ఎక్కడ దొరుకుతాయనేగా మీ సందేహం. సాధారణంగా పాత ఇళ్లను కూల్చిన సమయంలో సేకరించిన వైర్లు, పాడైన వైర్లు ఉంటాయి. ఇలా నేరుగా సేకరించవచ్చు లేదంటే పాత వైర్లు విక్రయించే స్క్రాపింగ్ పాయింట్స్‌లో కూడా అందుబాటులో ఉంటాయి.
ఇలాంటి సెంటర్ల నుంచి పాత వైర్లను సేకరించవచ్చు. ఈ పాత వైర్లను కిలో చొప్పు విక్రయిస్తారు. కిలో పాత వైర్లు రూ. 50 నుంచి రూ. 150 వరకు పలుకుతున్నాయి. వైర్లను మిషిన్స్‌లో పెడితే, వైర్‌పై ఉండే ప్లాస్టిక్ తోలు తొలగిపోయి రాగిని ఇట్టే బయటకు సేకరించవచ్చు. సేకరించిన కాపర్‌ను విక్రయిస్తే లభాలు పొందొచ్చు. అలాగే ప్లాస్టిక్‌ను కూడా సెపరేట్‌గా అమ్ముకోవచ్చు.
ఇక లాభాల విషయానికొస్తే.. మార్కెట్లో ఒక కిలో కాపర్ ధర రూ. 700 నుంచి రూ. 800 వరకు పలుకుతోంది. ఒక కిలో కాపర్ రావాలంటే మనం రెండు కిలోల స్క్రాప్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే ఇందుకు రూ. 200 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక కరెంట్ ఛార్జీలకు ఒక రూ. 100 వేసుకున్నా కిలో కాపర్ తయారీకి సుమారు రూ. 300 ఖర్చు అవుతుంది. ఈ లెక్కన తక్కువలో తక్కువ కిలో కాపర్‌ను రూ.700కి విక్రయించినా రూ. 300 లాభం వస్తుంది. ఇలా రోజుకు పది కిలోల కాపర్‌ను తయారు సేకరించగలిగితే రోజుకు రూ. 3 వేలు ఏటు పోవు. అంటే నెలకు రూ. లక్ష కచ్చితంగా పొందొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..