త్వరపడండి.! స్టాక్ అయిపోతోంది.. రూ. 80 వేల ఏసీ కేవలం రూ. 40 వేలకే..

| Edited By: Ravi Kiran

Nov 18, 2024 | 7:45 PM

త్వరపడండి.! స్టాక్ అయిపోతోంది.. రూ. 80 వేల ఏసీ కేవలం రూ. 40 వేలకే.. ఏంటి చలికాలంలో ఈ ఏసీల గోల అని అనుకుంటున్నారా.. లేట్ ఎందుకు ఈ స్టోరీ చదివితే.. మీరూ ఏసీ షాపునకు వెళ్ళడం ఖాయం..

త్వరపడండి.! స్టాక్ అయిపోతోంది.. రూ. 80 వేల ఏసీ కేవలం రూ. 40 వేలకే..
Ac
Follow us on

ప్రతి ఏటా టెంపరేచర్లు పెరుగుతూనే ఉన్నాయి. గత 20 ఏళ్ల సమాచారాన్ని పరిశీలిస్తే ప్రతి వేసవిలో ఒకటి నుంచి ఒకటిన్నర డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. అవి పక్కన పెడితే. జనాలు మాత్రం ఏసీలకు బాగా అలవాటు అయిపోయారు. పదేళ్ల క్రితం ఎగువ మధ్యతరగతి ఇళ్లలో ఏసీలు కనిపించేవి.. ఆ తర్వాత మధ్యతరగతి కుటుంబాల్లో కూడా ఏసీలు వాడడం మొదలైంది. ఇంట్లో ఒక బెడ్ రూమ్‌లో ఏసీ వాడకం నుంచి.. ఇప్పుడు ఎన్ని బెడ్రూమ్స్ ఉంటే అన్ని ఏసీలు ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఇక హాల్స్‌లో కూడా ఏసీ తప్పనిసరి అయిపోయింది. దీంతో ప్రతి ఏడాది ఎండతో పాటు ఏసీల వాడకం పెరుగుతూ వస్తోంది.

ఇది చదవండి: మీరు పుట్టిన తేదీని బట్టి మీ వెనకున్న దేవుడెవరో చెప్పొచ్చు.! ఎలాగో తెల్సా

చాలామంది ఎండాకాలం మొదలవగానే మార్చిలో ఏసీ కొనడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎయిర్ కండిషనర్ కొనేందుకు అసలైన సీజన్ ఇదే. చలికాలం ఏ ఎలక్ట్రానిక్స్ షాప్‌కి వెళ్ళినా.. ఎయిర్ కండిషనర్ ధరలపై బంపర్ ఆఫర్లు కనిపిస్తున్నాయి. కంపెనీలకు ఇది పూర్తిగా అన్ సీజన్. ఏదో ఒకలా మార్కెట్లో ఏసీలను అమ్మేందుకు ప్రయత్నం చేస్తుంటాయి. బజాజ్, విజయ్, రిలయన్స్ ఇలా ప్రముఖ ఎలక్ట్రానిక్ షాపులలో మంచి ఆఫర్స్‌తో ఏసీలు అందుబాటులో ఉన్నాయి. 1.5 టన్ ఏసీలపై ఎక్కువ డిస్కౌంట్లు కనిపిస్తున్నాయి. బ్రాండ్‌ను బట్టి 24 వేల నుంచి 50 వేల వరకు మార్కెట్లో దొరుకుతున్నాయి. హైదరాబాద్‌లో ఎక్కువగా అమ్ముడుపోయి రేంజ్ కూడా 1.5 టన్.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: తస్సాదియ్యా.! పే..ద్ద టాస్కే ఇది.. పామును గుర్తిస్తే మీరే తెలివైనవారే

ఇక 2 టన్ ఏసీలపై అయితే 30 నుంచి 40 శాతం డిస్కౌంట్లు ఉన్నాయి. కొత్తగా మార్కెట్లోకి కన్వర్టబుల్ ఏసీలు వచ్చాయి. దాదాపు అన్ని టాప్ బ్రాండ్స్‌లో ఇవి దొరుకుతున్నాయి. కన్వర్టబుల్ అంటే 1 టన్ నుంచి 2 టన్ వరకు మనకి అవసరం ఉన్నంత స్థాయిలో ఏసీని వాడుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మిగతా వాటితో పోలిస్తే వీటిపై డిస్కౌంట్ కాస్త తక్కువగానే ఉన్న.. వేసవికాలం రేట్లతో పోలిస్తే చాలా బెటర్ అంటున్నారు షాపుల నిర్వాహకులు. ఇప్పుడున్న డిస్కౌంట్లు పోను. ఎండాకాలం డిమాండ్‌కి రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇన్స్టిలేషన్‌కి చాలా రోజుల సమయం పడుతుంది. ఎలా చూసినా చల్లని ఎయిర్ కండిషనర్ కొనాలంటే ఈ చలికాలమే మంచి సీజన్ అంటున్నారు.(Source)

ఇది చదవండి: బాబోయ్.. అది రోడ్డు కాదు భారీ కొండచిలువ.. పట్టు జారితే పరలోకానికే

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..