Joint account: ఉమ్మడి ఖాతాలతో బోలెడు లాభాలు.. జాయింట్ అక్కౌంట్లతో ప్రయోజనాలు ఇవే..!

|

Dec 05, 2024 | 2:28 PM

ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా తప్పనిసరి అయ్యింది. చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా అన్ని అవసరాలకు కీలకంగా మారింది. ఆర్థిక లావాదేవీలు సక్రమంగా జరగడానికి బ్యాంకు ఖాాతా చాలా అవసరం. సాధారణంగా ఒకరికి ఒక ఖాాతా ఉంటుంది. అయితే ఇద్దరు, అంతకంటే ఎక్కువ మందికి కలిపి బ్యాంకులు జాయింట్ ఖాతాను కూడా అందజేస్తాయి. దీన్నే ఉమ్మడి ఖాతా అని కూడా పిలుస్తారు.

Joint account: ఉమ్మడి ఖాతాలతో బోలెడు లాభాలు.. జాయింట్ అక్కౌంట్లతో ప్రయోజనాలు ఇవే..!
Joint Bank Accounts
Follow us on

ఉమ్మడి ఖాతాలను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి ఉమ్మడి ఖాతాల వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. బ్యాంకులలో జాయింట్ ఖాతాలను జీవిత భాగస్వామితో కలిసి లేదా పిల్లలతో కలిసి తెరవొచ్చు. స్నేహితులు, వ్యాపార భాగస్వాములతో ప్రారంభించవచ్చు. భారతీయ రిజర్వు బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం జాయింట్ ఖాతాలో సభ్యుల సంఖ్యపై నిబంధనలు లేవు. అయితే కొన్ని బ్యాంకులు నలుగురికి మాత్రమే పరిమితం చేస్తున్నాయి. వీటిలో పొదుపు, కరెంట్, ఫిక్సడ్ లేదా రికరింగ్ డిపాజిట్ ఖాాతాలు ఉంటాయి. ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) కూడా దేశంలోని పౌరులతో కలిసి ఉమ్మడి ఖాతాను తీసుకునే అవకాశం కూడా ఉంది. జాయింట్ ఖాతాను దానిలోని సభ్యులలో ఎవ్వరైనా నిర్వహించవచ్చు. ఒకరు మరణించిన తర్వాత మరొకరు దాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. ఖాతాలోని ఏ లావాదేవీకైనా సభ్యులందరి సంతకం తప్పనిసరిగా కావాలి. అలాగే ఖాతాలోని సభ్యులందరూ తమ ఆధార్, పాన్, పాస్ పోర్టు లేదా ఓటరు గుర్తింపు కార్డులను అందజేయాలి. అదనపు భద్రత కోసం ఉమ్మడి ఖాతాకు నామినీకి కూడా నియమించుకోవచ్చు.

ఉమ్మడి ఖాతాకు సంబంధించి అందరు సభ్యులకు సమానంగా బాధ్యతలు ఉంటాయి. ఖాతాలోని ఓవర్ డ్రాప్టులు, రుణాలు ఇతర వాటికి బాధ్యులుగా ఉంటారు. ఖాతాలోని డిపాజిట్ల ద్వారా వచ్చిన వడ్డీ ఆదాయాన్ని పన్ను విధించడం కోసం ప్రాథమిక ఖాతాదారుకు ఆపాదిస్తారు. సభ్యుల మధ్య ఏమైనా వివాదాలు ఏర్పడితే ఆ సమస్య పరిష్కారమయ్యే వరకూ ఖాతాను స్తంభించవచ్చు. అలాగే మూసివేయడానికి అందరి సమ్మతి అవసరం. ఉమ్మడి ఖాాతాను ప్రారంభించడం చాలా సులభం. ముందుగా బ్యాంకుకు వెళ్లి, జాయింట్ ఖాతా దరఖాస్తును పూర్తి చేయాలి. ఖాతాదారులందరి గుర్తింపు, చిరునామా రుజువు, లేటెస్ట్ పాస్ పోర్టు ఫోటోలను అందజేయాలి. ఖాతాను ఎవరు నిర్వహించాలో తెలిపే ఆపరేషన్ మోడ్ ను ఎంచుకోవాలి. ఆ బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా ఖాతాలో కనీస డిపాజిట్ చేయాలి. అనంతరం మీ ఉమ్మడి ఖాతా అమల్లోకి వస్తుంది.

ఉమ్మడి ఖాతాలో సభ్యులందరూ సమష్టిగా నిర్ణయం తీసుకోవచ్చు. ఇవి వ్యక్తిగత ఖాతాల కంటే ఎక్కువ వడ్డీ రేటును అందిస్తాయి. డబ్బు ఆదా చేయడానికి ఉపయోగంగా ఉంటాయి. ఇద్దరి వ్యక్తుల మధ్య నిధులను బదిలీ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ఉమ్మడి పెట్టుబడులు, ఇతర ఆర్థిక కార్యకలాపాలను చాలా సులభంగా నిర్వర్తించగలం. కుటుంబంలోని సభ్యులందరూ కలిసి తీసుకుంటే కుటుంబ ఆర్థిక వ్యవహారాలను చాలా సలువుగా ట్రాక్ చేయగలిగే అవకాశం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..