
భారతీయ రైల్వేలు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రజారవాణా సాధనాల్లో ఒకటిగా ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత రద్దీ నెట్‌వర్క్‌లలో ఒకటి. ఏటా 11 బిలియన్లకు పైగా ప్రయాణీకులను, 1.416 బిలియన్ టన్నుల సరుకు రవాణా చేస్తుంది. రైల్వేలు సామాన్యులకు సుదూర రవాణాకు అత్యంత చౌకైన మార్గం. భారతీయ రైల్వే తన ప్రయాణికులకు అనేక రకాల సౌకర్యాలను అందిస్తుంది. దేశంలోని అనేక ప్రధాన రైలు స్టేషన్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఎగ్జిక్యూటివ్ లాంజ్ సేవలను అందిస్తాయి. ఈ ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లో మీరు లగ్జరీగా రైలు కోసం వేచి ఉండవచ్చు. ప్రయాణికులు రైల్వే లాంజ్‌లో టీ, కాఫీ, పీరియాడికల్స్, వార్తాపత్రికలు, వైఫై, రైలు సమాచారం, విశ్రాంతి గదులు, ఇతర సౌకర్యాలను పొందవచ్చు. అయితే ఈ సదుపాయాన్ని ఉపయోగించాలంటే కొన్ని రకాలు రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి కేవలం రూ. 2కే ఈ సౌకర్యాలను పొందవచ్చని చాలా మందికి తెలియదు. ఈ ప్రయోజనాన్ని అందించే అనేక క్రెడిట్ కార్డ్‌లు మార్కెట్‌లో ఉన్నాయి. కేవలం రూ. 2 లావాదేవీని రైల్వే లాంజ్ ఆపరేటర్ నాన్-రిఫండబుల్ కార్డ్ ధ్రువీకరణ ఛార్జీగా విధిస్తారు. కాబట్టి ఉచిత రైల్వే లాంజ్ యాక్సెస్‌ను అందించే కొన్ని క్రెడిట్ కార్డ్‌ల వివరాలను తెలుసుకుందాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి