
మీరు మీ ఆధార్ కార్డును పోగొట్టుకున్నా లేదా మీ ఆధార్ నంబర్ గుర్తులేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. UIDAI మీ ఆధార్ నంబర్ (UID) లేదా ఎన్‌రోల్‌మెంట్ ID (EID)ని తిరిగి పొందే ప్రక్రియను సులభతరం చేసింది. మీరు మీ ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో తిరిగి పొందవచ్చు.
మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉంటే మీరు UIDAI వెబ్‌సైట్‌లోని Retrieve UID/EID ఎంపికను ఉపయోగించి మీ ఆధార్ నంబర్ లేదా EIDని సులభంగా తిరిగి పొందవచ్చు. మీరు మీ పేరు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ చిరునామా, క్యాప్చాను నమోదు చేయాలి. అప్పుడు మీ ఫోన్ లేదా ఇమెయిల్ చిరునామాకు OTP వస్తుంది. OTP సరిగ్గా నమోదు చేసిన తర్వాత, మీ ఆధార్ నంబర్ లేదా EID SMS ద్వారా వస్తుంది. ఈ ప్రక్రియ ఉచితం, కొన్ని నిమిషాల్లోనే అయిపోతుంది.
మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ చేయబడకపోతే, మీరు సమీపంలోని ఆధార్ నమోదు/నవీకరణ కేంద్రాన్ని సందర్శించాలి. ఇక్కడ మీ పేరు, లింగం, జిల్లా లేదా పిన్ కోడ్ వంటి సమాచారం కోసం మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ ఉపయోగించి బయోమెట్రిక్ ధృవీకరణ జరుగుతుంది. ధృవీకరణ సరైనది అయితే ఆపరేటర్ మీ ఇ-ఆధార్‌ను ప్రింట్ చేసి మీకు అందజేస్తారు. ఈ రుసుము రూ.30.
మీరు 1947 కు కాల్ చేయడం ద్వారా కూడా మీ EID ని పొందవచ్చు. మీ సమాచారం సరిపోలిన తర్వాత మీకు EID జారీ చేస్తారు. తరువాత మళ్ళీ కాల్ చేసి IVRS ద్వారా మీ EID, పుట్టిన తేదీ, పిన్ కోడ్‌ను అందించడం ద్వారా, మీరు మీ ఆధార్ నంబర్‌ను కూడా అందుకుంటారు. ఈ సేవ పూర్తిగా ఉచితం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి