Insurance Policies: బీమా పాలసీతో రుణ సౌకర్యం.. ఎలా తీసుకోవాలంటే..

|

Jul 18, 2024 | 7:47 PM

ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్ డీఏఐ) ఇటీవల మార్పును ప్రవేశపెట్టింది. పాలసీదారులకు ప్రయోజనం చేకూర్చే విధానం తీసుకువచ్చింది. పాలసీ నిధులను లోన్ తీసుకునే వీలు కల్పించింది. అంటే పాలసీని సరెండర్ చేయాల్సిన అవసరం లేకుండానే ఊహించని అవసరాల కోసం ఆర్థిక సాయం పొందవచ్చు.

Insurance Policies: బీమా పాలసీతో రుణ సౌకర్యం.. ఎలా తీసుకోవాలంటే..
Insurance Policy
Follow us on

జీవిత బీమా పాలసీలు మన భద్రతకు భరోసానిస్తాయి. భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను, అనుకోని కష్టాలను అధిగమించడానికి ఉపయోగపడాయి. ఉద్యోగం నుంచి విరమణ పొందిన తర్వాత అండగా నిలుస్తాయి. దాదాపు ప్రతి ఒక్కరూ బీమా పాలసీలు తీసుకుంటారు. అయితే అనుకోని ఆపద ఎదురైనప్పుడు పాలసీల నుంచి రుణం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.

పాలసీల నుంచి రుణం..

ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్ డీఏఐ) ఇటీవల మార్పును ప్రవేశపెట్టింది. పాలసీదారులకు ప్రయోజనం చేకూర్చే విధానం తీసుకువచ్చింది. పాలసీ నిధులను లోన్ తీసుకునే వీలు కల్పించింది. అంటే పాలసీని సరెండర్ చేయాల్సిన అవసరం లేకుండానే ఊహించని అవసరాల కోసం ఆర్థిక సాయం పొందవచ్చు. ప్రస్తుతానికి మనీ బ్యాక్, ఎండోమెంట్ ప్లాన్లు తదితర బీమా పాలసీల నుంచి రుణం తీసుకునే అవకాశం ఉంది. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు (యూఎల్పీలు), టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల నుంచి అవకాశం ఉండదు.

గమనించాల్సిన అంశాలు..

  • బీమా పాలసీల నుంచి రుణం పొందేందుకు కొన్ని నంబంధనలు, షరతులు ఉంటాయి. అవి ఆయా బీమా కంపెనీలకు అనుగుణంగా రూపొందిస్తారు. ఈ నేపథ్యంలో బీమా నుంచి రుణం కోసం ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకుందాం.
  • మీరు తీసుకున్న పాలసీ ఏ రకానికి చెందినదో పరిశీలించడం చాలా అవసరం. మనీ బ్యాక్, ఎండోమెంట్ ప్లాన్లు తదితర నగదు విలువ కలిగిన పాలసీల నుంచి మాత్రమే రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. టర్మ్ జీవిత బీమా పాలసీలతో అవకాశం ఉండదు. దీనితో పాటు మీ పాలసీకి తగిన సరెండర్ విలువ ఉండాలి.
  • రుణాలకు సంబంధించిన సమాచారం, దరఖాస్తు విధానం కోసం మీ బీమా సంస్థ ప్రతినిధులను సంప్రదించాలి. వారు మీ అర్హత, వడ్డీ రేట్లు, రీపేమెంట్ నిబంధనలు తదితర వాటిపై అవగాహన కల్పిస్తారు.
  • గుర్తింపు, చిరునామా, బీమా పాలసీ డ్యాక్యుమెంట్ వంటి వాటిని సిద్ధంగా ఉంచుకోండి. రుణం తీసుకోవడానికి ఇవి కీలకంగా ఉంటాయి.
  • మీరు దరఖాస్తు ప్రక్రియను ఆన్‌లైన్‌లో లేదా బ్రాంచ్ కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా ప్రారంభించవచ్చు. దానిని బీమా సంస్థ పరిశీలిస్తుంది. ఆమోదం పొందిన తర్వాత మీకు రుణం అందజేస్తారు.

ప్రయోజనాలు..

పాలసీల నుంచి రుణాలు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

  • పాలసీ లోన్‌ను పొందడం చాలా సులభంగా ఉంటుంది. బీమా కంపెనీ దగ్గర ఇప్పటికే మీ సమాచారం ఉంటుంది. కాబట్టి ప్రక్రియ చాలా సులభంగా జరుగుతుంది.
  • వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు రుణాలతో పోల్చితే తక్కువ వడ్డీకే పాలసీ రుణాలు మంజూరు చేస్తారు.
  • బీమా పాలసీపై రుణం పొందానికి మీ క్రెడిట్ స్కోర్‌ అవసరం ఉండదు. పాలసీ నగదు విలువ ద్వారా రుణం మంజూరు చేస్తారు.
  • బీమా కంపెనీ దగ్గర ఇప్పటికే మీ సమాచారం ఉంటుంది. దీంతో రుణం చాలా సులభంగా మంజూరవుతుంది.
  • పాలసీ నుంచి రుణం తీసుకున్నప్పటికీ బీమా కవరేజీ కొనసాగుతుంది. ముఖ్యంగా పాలసీల నుంచి తీసుకున్న నిధులు సాధారణంగా ఆదాయపు పన్ను పరిధిలోకి రావు.
  • పాలసీల నుంచి తీసుకునే రుణాల వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని నష్టాలు కూడా కలుగుతాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించడం అవసరం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..