
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ గృహ రుణ రుణ రేటుకు బెంచ్‌మార్క్‌ను 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గించింది. ఈ రేటు తగ్గింపు వల్ల ఇప్పటికే ఉన్న రుణగ్రహీతలతో పాటు కొత్త గృహ రుణ గ్రహీతలకు ప్రయోజనం చేకూరుస్తుందని ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 9, 2025న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 0.25 శాతం తగ్గించిన తర్వాత గృహ రుణ బెంచ్‌మార్క్‌లో ఈ రేటు తగ్గింపు ప్రకటించారు.
ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ ద్వారా గృహ రుణాలకు వడ్డీ రేటు ఇప్పుడు 8 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఈ రేటు తగ్గింపు కారణంగా గృహ రుణ వడ్డీ మొత్తం మరింత అందుబాటులోకి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 28 నుంచి అమల్లోకి వచ్చాయి. సాధారణంగా గృహ రుణాలను రెండు వర్గాలుగా వర్గీకరిస్తూ ఉంటారు ఫిక్స్‌డ్ రేటు గృహ రుణాలు, ఫ్లోటింగ్ రేటు గృహ రుణాలు. ఈ రేటు తగ్గింపు ఫ్లోటింగ్ రేటు గృహ రుణాలకు ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్లోటింగ్ వడ్డీ రేటు గృహ రుణం బెంచ్‌మార్క్ రేటుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి బెంచ్‌మార్క్ రేటు మారినప్పుడల్లా వడ్డీ రేటు సవరించి కొత్త వడ్డీ రేటును వసూలు చేస్తారు. సాధారణంగా ఫిక్స్‌డ్ వడ్డీ రేటుతో వచ్చే గృహ రుణాలు పోలిస్తే ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు చౌకగా ఉంటాయి.
ఫిక్స్‌డ్ వడ్డీ రేట్లు ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల కంటే 1 శాతం నుంచి 2.5 శాతం వరకు ఎక్కువగా ఉంటాయి. ఫ్లోటింగ్ వడ్డీ రేటులో పెరుగుదల, తగ్గుదల తాత్కాలికమే, ఎందుకంటే ఇది మార్కెట్ ట్రెండ్‌లు, బెంచ్‌మార్క్ రేట్ల కదలిక మరియు బ్యాంక్ నిర్ణయించిన దాని ప్రకారం మారుతుంది. గృహ రుణాలు, ఇతర రుణాలు ఇప్పుడు బెంచ్‌మార్క్ రెపో రేటుతో అనుసంధానించి ఉంటాయి. కాబట్టి ఆర్‌బీఐ రెపో రేటుపై తీసుకునే నిర్ణయం మేరకు మీ గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి