LIC Policyholders: అన్ని డాక్యుమెంట్లలో ఆధార్‌తో పాటు పాన్‌కార్డు కూడా ఎంతో ముఖ్యం. బ్యాంకు అకౌంట్ తీయడం, బ్యాంకుకు సంబంధించిన ఇతర లావాదేవీలు చేయడం, ఎందులోనైనా పెట్టుబడి పెట్టడం, ఇతర స్కీమ్‌లకు పాన్ కార్డు తప్పనిసరి. ఇక ఎల్‌ఐసీలో అనేక రకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫిబ్రవరి 28వ తేదీలోగా ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) పాలసీదారులు తమ పాన్ కార్డు (PAN) నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. వచ్చే నెలాఖరులోగా మార్కెట్‌కు వచ్చే ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూలో 10 శాతం షేర్లను పాలసీదారుల కోసం రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 28లోగా పాన్ కార్డు వివరాలు అప్‌డేట్ చేసుకోవాలని పాలసీదారులకు సూచించింది. పాన్ వివరాలు నమోదు చేసుకుంటే ఇందుకు అర్హులని తెలిపింది. వీరికి ఐపీఓ షేర్ల కేటాయింపు ధరలలోనూ కొంత డిస్కౌంట్ అందించడం జరుగుతుందని ఎల్‌ఐసీ తెలిపింది. అర్హులైన పాలసీదారులు దామాషా పద్దతిలో ఐపీఓ షేర్లు కేటాయిస్తారు.
ఫిబ్రవరి 13న ప్రభుత్వ రంగ బీమా సంస్థ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి ప్రభుత్వం 5 శాతం వాటాను రూ.63,000 కోట్లకు విక్రయించేందుకు ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. 31.6 కోట్ల షేర్లు లేదా 5 శాతం ప్రభుత్వ వాటాల ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) మార్చిలో మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి: