AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Policy: ఎల్ఐసి కొత్త పాలసీ.. ఒక ప్రీమియం చెల్లిస్తే చాలు జీవితకాలం పెన్షన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

LIC Pension Policy: జీవిత బీమా సంస్థ- ఎల్‌ఐసి తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను ప్రకటిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఎల్‌ఐసి పాలసీలపై ప్రజలు విశ్వాసంతో ఉంటారు. తాజాగా న్యూ జీవన్ శాంతి పేరిట పెన్షన్ లింక్డ్..

LIC Policy: ఎల్ఐసి కొత్త పాలసీ.. ఒక ప్రీమియం చెల్లిస్తే చాలు జీవితకాలం పెన్షన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
LIC Policy
Amarnadh Daneti
| Edited By: |

Updated on: Nov 15, 2022 | 10:40 AM

Share

జీవిత బీమా సంస్థ- ఎల్‌ఐసి తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను ప్రకటిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఎల్‌ఐసి పాలసీలపై ప్రజలు విశ్వాసంతో ఉంటారు. తాజాగా న్యూ జీవన్ శాంతి పేరిట పెన్షన్ లింక్డ్ బీమాతో ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తోంది. ఈ పాలసీలో ఒక్కసారి పెట్టుబడి పెడితే..జీవితాంతం పెన్షన్ అందుకునే అవకాశముంది. వృద్ధాప్యంలో ఖర్చుల కోసం ఆలోచించేవారికి ఈ పాలసీ మంచి ఎంపిక అవుతుంది. పెద్ద వయసులో జీవితానికి భద్రత కల్పించే మంచి పథకంగా దీనిని చెప్పుకోవచ్చు. ఒక్కసారే పెట్టుబడి పెడితే జీవితమంతా పెన్షన్ గ్యారంటీ లభిస్తుంది. ఈ పథకం ఎల్ఐసీకు చెందిన పాత జీవన్ పాలసీ వంటిదే. జీవన్ శాంతి పాలసీలో రెండు ఆప్షన్లు ఉంటాయి. మొదటిది తక్షణ ఎన్యుటీ కాగా రెండవది డిఫర్డ్ ఎన్యుటీ. ఇదొక సింగిల్ ప్రీమియం ప్లాన్. తక్షణ ఎన్యుటీలో పాలసీ తీసుకున్న వెంటనే పెన్షన్ సౌలభ్యం లభిస్తుంది. ఇక రెండవ డిఫర్డ్ ఎన్యుటీలో పాలసీ తీసుకున్న తరువాత అంటే 5,10,15 లేదా 20 ఏళ్ల తరువాత పెన్షన్ సౌలభ్యం లభిస్తుంది.

ఈ పాలసీలో పెన్షన్ గ్యారంటీ ఉంటుంది. పెట్టుబడి, వయస్సు, డిఫర్మెంట్ పీరియడ్ ప్రకారం పెన్షన్ ఎంతనేది వర్తిస్తుంది. పెట్టుబడి,పెన్షన్ ప్రారంభానికి మధ్య కాలవ్యవధి ఎంత ఎక్కువగా ఉంది లేదా వయస్సు ఎంత ఎక్కువగా ఉందో పెన్షన్ కూడా అంతే లభిస్తుంది.

ఈ ఎల్ఐసీ పాలసీ కోసం కనీస వయస్సు 30 ఏళ్లు కాగా, గరిష్ట వయస్సు 85 ఏళ్లుగా ఉంది. అంతేకాకుండా జీవన్ శాంతి పాలసీలో రుణం, పెన్షన్ ప్రారంభమైన ఒక ఏడాది తరువాత దీన్ని సరెండర్ చేయవచ్చు. పెన్షన్ ప్రారంభమైన 3 నెలల తరువాత అందించవచ్చు. రెండు ఆప్షన్లలో పాలసీ తీసుకునేటప్పుడు ఏడాది వడ్డీ గ్యారంటీ ఉంటుంది. ఈ పాలసీలో విభిన్నమైన వార్షిక ప్రత్యామ్నాయాలు, వార్షిక చెల్లింపుల సౌలభ్యముంది. ఒకసారి ఎంచుకున్న ఆప్షన్‌ను తిరిగి మార్చే వీలుండదు. ఈ పాలసీని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కూడా తీసుకునే సౌలభ్యం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్