లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బీమా సంస్థ. దీనిలో వందలాది పథకాలు ఉన్నా.. ఎప్పుడైనా కొత్త పథకం ప్రారంభిస్తే అందరికీ దానిపై అమితమైన ఆసక్తి ఉంటుంది. దానిలో ఉండే ప్రయోజనాలు ఏంటి? పాలసీ వివరాలు ఏంటి అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎల్ఐసీ కూడా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ప్లాన్లను పరిచయం చేస్తోంది. ఇప్పడు ఎల్ఐసీ జీవీన్ కిరణ్ అనే కొత్త ప్లాన్ ను పరిచయం చేసింది. జూలై 27నే దీనిని మన దేశంలో ఆవిష్కరించింది. ఇది టర్మ్ పాలసీ అయినప్పటికీ మీరు చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందే వీలుంటుంది. అంతేకాక యాక్సిడెంట్ కవర్ కూడా ఉంటుంది. వాస్తవానికి టర్మ్ పాలసీల్లో కట్టిన ప్రీమియంలు తిరిగివ్వరు. అయితే దీనిలో కొన్ని మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ కొత్త ప్లాన్ జీవన్ కిరణ్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎల్‌ఐసీ ‘జీవన్ కిరణ్’ అనే ప్లాన్ నాన్-లింక్డ్, నాన్ పార్టిసిటింగ్ పాలసీ. ప్లాన్‌లో రెండు రకాల ఐచ్ఛిక రైడర్‌లు ఉన్నాయి- ప్రమాదవశాత్తు మరణం, వైకల్యం ప్రయోజనం రైడర్, ప్రమాద ప్రయోజన రైడర్. పాలసీదారులు అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా అటువంటి రైడర్‌లను ఎంచుకోవచ్చని ఎల్‌ఐసీ ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా, 5 సంవత్సరాలలో మెచ్యూరిటీ/డెత్ బెనిఫిట్ పొందేందుకు సెటిల్మెంట్ ఆప్షన్ అందుబాటులో ఉందని పేర్కొంది.
మెచ్యూరిటీ.. ప్లాన్ తీసుకున్న వ్యక్తి మెచ్యూరిటీ సమయానికి బతికి ఉంటే పన్నులు మినహాయించి, మీరు చెల్లించిన మొత్తం ప్రీమియం ను వెనక్కి ఇచ్చేస్తారు.
మరణం.. పాలసీ తీసుకున్న వ్యక్తి మధ్యలోనే మరణించిన సందర్భంలో మరణంపై హామీ మొత్తం చెల్లించబడుతుంది. ఆ హామీ మొత్తం ఇలా ఉంటుంది.
ఫీచర్లు ఇవి..
ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్లాన్ ఆన్‌లైన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది ఏజెంట్లు, కార్పొరేట్ ఏజెంట్లు, బ్రోకర్లు, బీమా మార్కెటింగ్ సంస్థలు (ఐఎంఎఫ్) ద్వారా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..