LIC Kanyadan Scheme: ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ.. బాలికల విద్య, వివాహ ఖర్చుల కోసం అద్భుతమైన స్కీమ్‌

LIC అమ్మాయిల కోసం కొన్ని మంచి పాలసీలు ఉన్నాయి. ఎల్‌ఐసీ జీవన్ తరుణ్, ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ, ఎల్‌ఐసీ చైల్డ్ ఫ్యూచర్ ప్లాన్, ఎల్‌ఐసీ సింగిల్ ప్రీమియం చైల్డ్ ప్లాన్ మొదలైన ప్లాన్‌లు ఉన్నాయి. ఈ పాలసీలు ఆడపిల్లల ఆర్థిక అవసరాలు..

LIC Kanyadan Scheme: ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ.. బాలికల విద్య, వివాహ ఖర్చుల కోసం అద్భుతమైన స్కీమ్‌
Lic Policy

Updated on: Jul 18, 2023 | 5:50 PM

LIC అమ్మాయిల కోసం కొన్ని మంచి పాలసీలు ఉన్నాయి. ఎల్‌ఐసీ జీవన్ తరుణ్, ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ, ఎల్‌ఐసీ చైల్డ్ ఫ్యూచర్ ప్లాన్, ఎల్‌ఐసీ సింగిల్ ప్రీమియం చైల్డ్ ప్లాన్ మొదలైన ప్లాన్‌లు ఉన్నాయి. ఈ పాలసీలు ఆడపిల్లల ఆర్థిక అవసరాలు, ఆమె పెద్దయ్యాక విద్య, వివాహ ఖర్చులను భరిస్తాయి. వీటిలో ఎల్‌ఐసి కన్యాదాన్ పాలసీ మరింత దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక సంవత్సరం పైబడిన ఆడపిల్లల పేరుతో ఈ పథకాన్ని తీసుకోవచ్చు. తండ్రి, తల్లి లేదా ఇతర సంరక్షకులు 18 నుంచి 50 వయస్సు వారు ఎల్‌ఐసీ కన్యాదాన్ ప్లాన్‌ని ప్రారంభించవచ్చు. పాలసీ వ్యవధి 13 నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుంది.

 కన్యాదాన్ పాలసీ 2023 ముఖ్యాంశాలు:

  1. NRIతో సహా ఎవరైనా భారతీయ వ్యక్తి ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.
  2. పాలసీ పొందడానికి ఆడపిల్లకి కనీసం 1 సంవత్సరం వయస్సు ఉండాలి. తల్లిదండ్రులు ఆడపిల్ల పేరు మీద పాలసీని ప్రారంభించవచ్చు. తల్లిదండ్రుల వయస్సు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాల్సి ఉంటుంది.
  3. నెలకు ఒకసారి ప్రతి మూడు నెలలకు, ఆరు నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది.
  4. ఈ పాలసీలో రోజుకు రూ .75 చొప్పున పెట్టుబడి పెడితే 25 ఏళ్ల తర్వాత రూ.14 లక్షల రాబడి వస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. పాలసీ వ్యవధికి ముందు 3 సంవత్సరాలకు మాత్రమే ప్రీమియం చెల్లింపు.
  7. పాలసీ లబ్ధిదారుడు ప్రమాదంలో మరణిస్తే కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల పరిహారం.
  8. లబ్ధిదారుడు సహజ మరణమైతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందజేస్తారు.
  9. మీరు వరుసగా 3 సంవత్సరాలు ప్రీమియం చెల్లించినట్లయితే, మీరు పాలసీని ఉంచడం ద్వారా లోన్ పొందవచ్చు. అప్పటి వరకు మీరు చెల్లించిన ప్రీమియం మొత్తం ప్రకారం మీకు లోన్ లభిస్తుంది.
  10. ఈ పాలసీలో ఏ మొత్తానికి పన్ను లేదు. ఇది పన్ను మినహాయింపునకు కూడా ఉపయోగపడుతుంది.
  11. పాలసీదారు మరణిస్తే ప్రీమియం చెల్లించడం కొనసాగించాల్సిన అవసరం లేదు. అదనంగా, కుటుంబానికి ప్రతి సంవత్సరం రూ.1 లక్ష పరిహారం అందుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి