LIC IPO: మే 12కు ముందే ఎల్‌ఐసీ ఐపీఓ..! సెబీకి DRHP సమర్పించిన అధికారులు..

|

Mar 22, 2022 | 6:00 AM

LIC IPOకి సంబంధించి అప్‌డేట్ వచ్చింది. మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI కి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) తాజా DRHP ని సమర్పించింది...

LIC IPO: మే 12కు ముందే ఎల్‌ఐసీ ఐపీఓ..! సెబీకి DRHP సమర్పించిన అధికారులు..
Lic Ipo
Follow us on

LIC IPOకి సంబంధించి అప్‌డేట్ వచ్చింది. మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI కి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) తాజా DRHP ని సమర్పించింది. CNBC నివేదిక ప్రకారం, డిసెంబర్ త్రైమాసిక ఫలితాల ఆధారంగా LIC తాజాగా DRHPని సమర్పించింది. పాత DRHPకి ఇచ్చిన ఆమోదం ప్రకారం, LIC మే 12 నాటికి IPO తీసుకురావచ్చు. ఆ తర్వాత పత్రాలను మళ్లీ సెబీకి సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 13న LIC IPO కోసం DRHP సమర్పించింది. అయితే స్టాక్‌ మార్కెట్ అస్థిరత కారణంగా ఐపీఓ తీసుకురావడంపై ఆలోచిస్తున్నారు. డిసెంబర్ త్రైమాసికంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పనితీరును పరిశీలిస్తే, కంపెనీ నికర లాభం 2,349 కోట్లకు పెరిగింది. డిసెంబర్ 2020లో కంపెనీ నికర లాభం 90 లక్షలు మాత్రమే. డిసెంబర్ 2020 త్రైమాసికంలో మొదటి సంవత్సరం ప్రీమియం రూ.7957.37 కోట్ల నుంచి రూ.8748.55 కోట్లకు పెరిగింది. రెన్యూవల్ ప్రీమియం రూ.56,822 కోట్లకు పెరిగింది. డిసెంబర్ త్రైమాసికంలో మొత్తం ప్రీమియం ఏడాది క్రితం రూ.97008 కోట్ల నుంచి రూ.97761 కోట్లుగా ఉంది.

LIC IPO అతిపెద్ద IPO అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అందుకే ఈ IPO కోసం సరైన సమయం అవసరమని RBI తెలిపింది. ఇది కాకుండా రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఏప్రిల్ 1, 2021, జనవరి 2022 మధ్య, మొత్తం 289 లక్షలు అంటే 2.89 కోట్ల కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరిచారు. ఎల్‌ఐసీలో దాదాపు 316 మిలియన్ షేర్లు లేదా 5 శాతం వాటాల విక్రయం కోసం మార్చిలో ఐపీఓ తీసుకురావాలని ప్రభుత్వం ముందుగా ప్రణాళిక వేసింది. ఈ ఐపీఓ నుంచి దాదాపు రూ.60,000 కోట్లు సమీకరించాలని భావించారు. అయితే, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత స్టాక్ మార్కెట్‌లో భారీ ఒడిదుడుకుల దృష్ట్యా, IPO వాయిదా పడతూ వస్తుంది.

Read Also.. Mukesh Ambani: అంబానీ మనవడా మజాకా.. 15 నెలలకే బడి బాట.. మొదటి రోజు ఇలా..