LG Independence Day Sale: ఎల్‌జీ నుంచి అదిరే డీల్స్‌.. ఏకంగా రూ. 40వేలు వరకూ ఆదా చేసుకునే అవకాశం

|

Aug 15, 2024 | 1:25 PM

ఎల్‌జీ కూడా తన బ్రాండ్‌ వస్తువులపై భారీ డీల్స్‌ ప్రకటించింది. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా నుంచి తన ఉత్పత్తి శ్రేణిలో పలు క్యాష్‌బ్యాక్‌లు, ఈఎంఐ ఆఫర్లను అందిస్తోంది. ఎల్‌జీ ఫ్రీడమ్‌ కార్నివాల్ సేల్‌లో భాగంగా ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ఇతర ఉత్పత్తులపై డీల్స్‌ను అందిస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.

LG Independence Day Sale: ఎల్‌జీ నుంచి అదిరే డీల్స్‌.. ఏకంగా రూ. 40వేలు వరకూ ఆదా చేసుకునే అవకాశం
Lg Independence Day Sale
Follow us on

మార్కెట్లో లైఫ్స్‌ గుడ్‌(ఎల్‌జీ) బ్రాండ్‌కు మంచి పేరు ఉంది. ఏళ్లుగా ఉన్న కంపెనీ కావడం, అత్యుత్తమ నాణ్యతతో పాటు అనువైన ధరలోనే అందుబాటులో ఉండటంతో ఆయా వస్తువులను జనాలు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. ఎల్‌జీ బ్రాండ్‌ నుంచి అన్ని ఎలక్ట్రానిక్స్‌ వస్తువులతో పాటు గృహోపకరణాలు కూడా మార్కెట్లో ఉంటున్నాయి. ప్రస్తుతం స్వాతంత్య్ర దినోత్సవ సేల్స్‌ అన్ని ప్లాట్‌ ఫారంలలో నడుస్తోంది. ఈ క్రమంలో ఎల్‌జీ కూడా తన బ్రాండ్‌ వస్తువులపై భారీ డీల్స్‌ ప్రకటించింది. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా నుంచి తన ఉత్పత్తి శ్రేణిలో పలు క్యాష్‌బ్యాక్‌లు, ఈఎంఐ ఆఫర్లను అందిస్తోంది. ఎల్‌జీ ఫ్రీడమ్‌ కార్నివాల్ సేల్‌లో భాగంగా ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ఇతర ఉత్పత్తులపై డీల్స్‌ను అందిస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.

ప్రత్యేక ఆఫర్లు, తగ్గింపులు..

  • కొన్ని ఎంపిక చేసిన ఉత్పత్తులపై 26శాతం క్యాష్‌బ్యాక్‌ లేదా రూ. 40,000 డిస్కౌంట్‌ను ఎల్‌జీ అందిస్తోంది.
  • కేవలం రూ. 15 డౌన్‌ పేమెంట్‌తోనే వస్తువును కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా అందిస్తోంది. మిగిలిన బ్యాలెన్స్‌ ఈఎంల రూపంలో చెల్లించొచ్చు.
  • అదనంగా కొన్ని మోడళ్లపై రూ. 888 ఫిక్స్‌డ్‌ ఈఎంఐ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది.

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌పై డీల్స్‌ ఇవే..

వారంటీ: ఎంచుకున్న ఎల్‌జీ టీవీలపై 3 సంవత్సరాల వారంటీని అందిస్తోంది.
ఓఎల్‌ఈడీ టీవీ ఆఫర్‌లు: రూ.50,000 వరకు విలువైన ప్రయోజనాలను ఓఎల్‌ఈడీ టీవీలపై అందిస్తోంది.

సౌండ్‌బార్లు: ఎంపిక చేసిన ఎల్‌జీ టీవీలతో పాటు సౌండ్‌ బార్లు కొనుగోలు చేస్తే 30% వరకు తగ్గింపు లభిస్తుంది.

ఎల్‌జీ ఎక్స్‌బూమ్‌: ఎంపిక చేసిన మోడల్‌లపై ఉచిత మైక్రోఫోన్ లభిస్తుంది.

గృహోపకరణాలపై ఆఫర్లు ఇవే..

వాషింగ్ మెషీన్లు: ఎంపిక చేసిన మోడళ్లపై ఒక ఈఎంఐ రద్దుకు అవకాశం ఉంటుంది.
వాటర్ ప్యూరిఫైయర్స్: ఎంపిక చేసిన మోడళ్లపై ఏడాదిలో ఒకసారి మెయింటెనెన్స్‌ను ఉచితంగా నిర్వహిస్తారు. దీని ఎంపిక రూ. 4,200కాగా ఉచితంగా చేస్తారు.

రిఫ్రిజిరేటర్లు: ఇన్‌స్టా వ్యూ సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్ కొనుగోలు చేస్తే రూ. 11,999 విలువైన మినీ రిఫ్రిజిరేటర్ ఉచితంగా అందిస్తోంది.

ఎయిర్ కండిషనర్లు: స్ల్పిట్, విండో ఏసీ మోడళ్లపై 5 సంవత్సరాల వారంటీని అందిస్తోంది.
మైక్రోవేవ్‌లు: ఎంపిక చేసిన మోడల్స్‌లో చార్‌కోల్ లైటింగ్ హీటర్‌పై 10 సంవత్సరాల వారంటీని అందిస్తోంది.

ఇ-వేస్ట్ కోసం..

బాధ్యతాయుతమైన ఈ-వేస్ట్ రీసైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు ఎల్‌జీ ‘ఫ్రీడం ఫ్రమ్ ఈ-వేస్ట్’ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తోంది. పాల్గొనేవారు ఆన్‌లైన్‌లో ప్రతిజ్ఞ చేయవచ్చు దీని ద్వారా ఉత్తేజకరమైన వస్తువులను గెలుచుకునే అవకాశం ఉంది.

ఈ ఆఫర్లు ఎక్కడ, ఎప్పుడు..

ఎల్‌జీ అందిస్తున్న ఈ ఆఫర్లు ఆగస్టు 20, 2024 వరకు అందుబాటులో ఉంటాయి. కస్టమర్‌లు ఈ డీల్‌ల ప్రయోజనాన్ని పొందడానికి ఎల్‌జీ బ్రాండ్ షాప్‌లు, ఇతర రిటైల్ లొకేషన్లను సందర్శించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..