Lava Shark 2: లావా నుంచి కొత్త ఫోన్! ఐఫోన్‌ను తలపించేలా కెమెరా సెటప్!

దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా తన లేటెస్ట్ మొబైల్ లావా షార్క్ 2 (Lava Shark 2)ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ నుంచి మరికొన్ని ఫోన్లు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ లో ప్రధానంగా కెమెరా పెర్ఫామెన్స్, డిజైన్‌ హైలైట్ అవ్వనున్నాయి. ఈ ఫోన్ గురించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

Lava Shark 2: లావా నుంచి కొత్త ఫోన్! ఐఫోన్‌ను తలపించేలా కెమెరా సెటప్!
Lava Shark 2

Updated on: Oct 25, 2025 | 5:46 PM

లావా నుంచి రిలీజ్ అవ్వబోతున్న Lava Shark 2 మొబైల్ లో 50 మెగాపిక్సెల్ తో కూడిన AI ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఈ ఫోన్ లో ఫోటోగ్రఫీ ఎక్స్ పీరియెన్స్ మరింత ప్రీమియంగా ఉండనుంది. అయితే ఈ ఫోన్ కెమెరా డిజైన్.. ఐఫోన్ 16ను తలపించేలా ఉండడం విశేషం. ఇందులో 50MP AI కెమెరాతోపాటు LED ఫ్లాష్ అలాగే ముందువైపు 8 MP సెల్ఫీకెమెరా ఉన్నాయి. లావా లోగో తీసేసి చూస్తే ఇది అచ్చం ఐఫోన్ 16 లాగానే ఉంటుంది.

స్పెసిఫికేషన్లు

ఇక Lava Shark 2 స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇందులో 6.75 అంగుళాల HD+  డిస్ ప్లే.. 90Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది యునిసాక్ T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్ పై పని చేస్తుంది. దీని బేసిక్ వేరియంట్ 4GB + 64GB  ఆప్షన్ తో వస్తుంది. అదనంగా 4GB వర్చువల్ RAM , మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. 1TB వరకు ఎక్స్‌టెర్నల్ స్టోరేజ్‌కి కూడా సపోర్ట్ ఇస్తుంది.

ప్రీమియం లుక్

ఇకపోతే ఇందులో 5,000mAh బ్యాటరీతో ఉంటుంది. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేస్తుంది.  అలాగే  ఈ హ్యాండ్‌సెట్‌ 5G, 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.0, జీపీయస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లున్నాయి.  USB టైప్-C పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటివి ఉన్నాయి. ఇక డిజైన విషయానికొస్తే.. ఫోన్ ముందు భాగంలో వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్ ఉంటుంది. వెనుక భాగం స్మూత్, కర్వ్‌డ్ ఎడ్జ్‌లతో అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. చూడ్డానికి అచ్చం ఐఫోన్ 16 లాగా ఉంటుంది. ఫోన్ కు మెటాలిక్ ఫినిష్ ఫ్రేమ్ ఉంటుంది. ఇది ఫోన్‌కు ప్రీమియం లుక్ ఇస్తుంది. ఇది బ్లూ (Blue), సిల్వర్ (Silver) రంగుల్లో లభించనుంది. అయితే ఈ మొబైల్ ధరలు ఇంకా వెల్లడించలేదు. స్పెసిఫికేషన్లను బట్టి చూస్తే.. రూ. 15 వేల లోపు బడ్జెట్ లోనే ఈ ఫోన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి