Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది.. లాంచింగ్ ఎప్పుడంటే..

|

Jun 25, 2024 | 1:19 PM

ఆ సౌండ్ కోసమే ఈ బండి వాడేవారున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్న తరుణంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా తన మొదటి ఎలక్ట్రిక్ వేరియంట్ ను తీసుకొచ్చేందుకు గత కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దీని ప్రోటో టైప్ ను కూడా ప్రదర్శించింది. పలు దఫాలుగా పరీక్షిలు సైతం నిర్వహించింది. ఇప్పుడు దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సమాయత్తమవుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది.. లాంచింగ్ ఎప్పుడంటే..
Royal Enfield Electric
Follow us on

మన భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. మార్కెట్లో ఎన్ని వందల రకాల మోటార్ సైకిళ్లు అందుబాటులో ఉన్నారాయల్ ఎన్‌ఫీల్డ్ కి మాత్రం క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. ఏళ్లుగా దాని బ్రాండ్ ఇమేజ్ ని అలా కాపాడుకుంటూ వస్తుంది. ఈ బండి సౌండే చాలా విభిన్నం. దీనికే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సౌండ్ కోసమే ఈ బండి వాడేవారున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్న తరుణంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా తన మొదటి ఎలక్ట్రిక్ వేరియంట్ ను తీసుకొచ్చేందుకు గత కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దీని ప్రోటో టైప్ ను కూడా ప్రదర్శించింది. పలు దఫాలుగా పరీక్షిలు సైతం నిర్వహించింది. ఇప్పుడు దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సమాయత్తమవుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

భారీగా పెట్టుబడులు..

రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతీయ మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేస్తోంది. ఇది ఇప్పటికే ప్రోటోటైప్ మోడల్‌ను పరీక్షిస్తోంది. ఈ సమాచారాన్ని ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ సిద్ధార్థ లాల్ తెలియజేశారు. ఆయన చెబుతున్న దాని ప్రకారం బ్రాండ్ వాణిజ్య వైపు గుర్తించడానికి ఒక బృందాన్ని కూడా ఉంచింది. బ్రాండ్ రాబోయే రెండేళ్లలో ఈ ఉత్పత్తిని ప్రారంభించాలని యోచిస్తోంది. అందుకోసమే గత ఆర్థిక సంవత్సరం అంటే 2023-2024లో రాయల్ ఎన్‌ఫీల్డ్ రూ. 1,000 కోట్ల క్యాపెక్స్‌ని క్రమబద్ధీకరించింది. ఈ పెట్టుబడిలో ఎక్కువ భాగం ఎలక్ట్రిక్ ఉత్పత్తులపైనే పెట్టింది.

పని చేస్తున్న 100 మంది సిబ్బంది..

ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ కోసం కంపెనీ ఇప్పటికే 100 మందిని నియమించుకుంది. ఇది ఈవీల కోసం కొత్త ఉత్పత్తి లైన్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియ. ప్రారంభంలో, ఈ ఉత్పత్తి లైన్ సంవత్సరంలో 1.5 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయగలదు. రానున్న కొద్ది నెలల్లోనే రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్ వేరియంట్ లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది.

పెరుగుతున్న పోటీ..

గత కొన్ని నెలలుగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు మార్కెట్లో చాలా గట్టి పోటీ ఏర్పడింది. ప్రధానంగా హార్లే డేవిడ్‌సన్ ఎక్స్440, ట్రయంఫ్ స్పీడ్ 400లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ పోటీపడుతోంది. రాయల్ ఎన్ఫీల్డ్ అనేక కొత్త బైక్‌లను వరుసలో ఉంచడంతో సవాలుకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్‌లో కొత్త బుల్లెట్ 350ని విడుదల చేయనుంది . ఆ తర్వాత, హిమాలయన్ 450 వచ్చే అవకాశం ఉంది. అలాగే స్క్రాంబ్లర్, బ్యాగర్‌తో కొన్ని 650సీసీ బైక్‌లు కూడా అప్ కమింగ్ లైనప్లో ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..