Bank Interest Rates: ఆ బ్యాంకు కీలక నిర్ణయం.. గృహ రుణాలపై స్వల్పంగా వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం..!

|

Nov 09, 2021 | 1:53 PM

Bank Interest Rates: ప్రస్తుతం బ్యాంకులు రుణాలపై వడ్డీ శాతం తగ్గింపుతో అందిస్తున్నాయి. పండగ సీజన్‌లో గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహనాల రుణాలలో తక్కువ..

Bank Interest Rates: ఆ బ్యాంకు కీలక నిర్ణయం.. గృహ రుణాలపై స్వల్పంగా వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం..!
Follow us on

Bank Interest Rates: ప్రస్తుతం బ్యాంకులు రుణాలపై వడ్డీ శాతం తగ్గింపుతో అందిస్తున్నాయి. పండగ సీజన్‌లో గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహనాల రుణాలలో తక్కువ వడ్డీకే అందించడంతో పాటు ప్రాసెసింగ్‌ రుసుము కూడా తగ్గించాయి. అయితే తాజాగా ఓ బ్యాంకు స్వల్పంగా వడ్డీ శాతం పెంచింది. ప్రైవేటు రంగ బ్యాంకు కటక్‌ మహీంద్రా.. గృహ రుణాలపై వడ్డీరేటు స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

పెంచిన వడ్డీ రేట్లు డిసెంబర్‌ 10, 2021 నుంచి అమల్లోకి రానుంది. కొత్త వడ్డ ఈరేటు 0.05 శాతం మేర పెంచనుంది. ఈ బ్యాంకు గృహ రుణాలపై ప్రస్తుతం వడ్డీ రేటు 6.50 శాతం ఉండగా, డిసెంబర్‌ 10 నుంచి 6.55 శాతానికి పెంచనున్నట్లు తెలిపింది.

కాగా, భారతదేశంలోని 180 నగరాలు, పట్టణాలలో కోటక్‌ మహీంద్రా గృహ రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే బ్యాంకు కస్టమర్లు రుణం కోసం మొబైల్‌ బ్యాంకింగ్‌ లేదా యాప్‌ ద్వారా, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని బ్యాంకు తన ప్రకటనలో తెలిపింది.

పండగ సీజన్‌లో తాము ప్రకటించిన ఆఫర్లకు ఖాతాదారుల నుంచి మంచి స్పందన వచ్చిందని కోటక్‌ బ్యాంకు తెలిపింది. తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కాగా, దాదాపు అన్ని బ్యాంకులు కూడా దసరా, దీపావళి పండగ సీజన్‌లో గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాయి. లోన్‌కు సంబంధించిన ప్రాసెసింగ్‌ ఫీజుల్లో రాయితీలు, డిస్కౌంట్లు కల్పించాయి. ఇప్పుడు ఈ బ్యాంకు స్వల్పంగా వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి:

Personal Loan: తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలు.. రూ.5 లక్షల రుణంపై ఎంత వడ్డీ.. నెలకు EMI.. పూర్తి వివరాలు

Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.10వేల డిపాజిట్‌తో చేతికి రూ.7 లక్షలు.. పూర్తి వివరాలు

Railway Stations: ప్రపంచంలోని టాప్‌ 10 అతిపెద్ద రైల్వే స్టేషన్స్ ఏమిటో తెలుసా..? టాప్‌లో 7 భారత్‌కు చెందినవే..!