ఎవరైనా MRP కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారా? ఇలా ఫిర్యాదు చేయండి!

MRP Rate: కొన్ని షాపులలో వస్తువులు MRP కంటే ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. వినియోగదారులు కూడా చేసేదేమి లేక ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకే తీసుకుంటారు. కానీ ఎమ్మార్పీ కంటే ఎక్కువ తీసుకోవద్దనే విషయం మీకు తెలుసా? ఇలా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నట్లయితే మీరు ఫిర్యాదు చేయవచ్చు..మీ హక్కులను తెలుసుకుని, అధిక ధరలకు వ్యతిరేకంగా పోరాడండి..

ఎవరైనా MRP కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారా? ఇలా ఫిర్యాదు చేయండి!
MRP Rate

Updated on: Mar 01, 2026 | 4:40 PM

MRP Rate: సాధారణంగా ఏ వస్తువుపైనా కూడా ఎంఆర్‌పీ (MR) రేటు ఉంటుంది. దాని ఎమ్మార్పీ రేటుకు అమ్మాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో అంటే రైల్వే స్టేషన్స్‌, ఎయిర్‌పోర్ట్‌, లేదా మాల్స్‌, ఇతర రోడ్‌సైడ్‌ ప్రాంతాల్లో ఉన్న షాపులలో ఎంఆర్‌పీ కంటే ఎక్కువ రేటుకు విక్రయిస్తారు. లీగల్ మెట్రాలజీ ఆక్ట్ ప్రకారం.. ఏ షాప్ కీపర్ అయినా సరే, రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫార్మ్ మీద లేదా మరే ఇతర ప్రదేశంలోనైనా వస్తువుల MRP (గరిష్ట చిల్లర ధర) కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ వసూలు చేయకూడదు. ఇది చట్ట విరుద్ధమైనది. వినియోగదారులకు తమ హక్కుల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటం అత్యవసరం.

ఒకవేళ మీకు ఏదైనా వస్తువు MRP కంటే ఎక్కువ ధరకు విక్రయించడానికి ప్రయత్నిస్తే మీరు ఈ ఉల్లంఘనపై తక్షణమే ఫిర్యాదు చేయవచ్చు. దీనికోసం పేర్కొన్న నిర్దిష్ట హెల్ప్‌లైన్ నంబర్‌ 139కు కాల్ చేయవచ్చు లేదా రైల్ మదద్ మొబైల్ యాప్ ద్వారా మీ ఫిర్యాదును సులభంగా నమోదు చేయవచ్చు. ఇలాంటి కంప్లైంట్ మొదటిసారి దాఖలైనట్లయితే సదరు షాప్ కీపర్‌కు రూ.25,000 జరిమానా విధిస్తారు. రెండోసారి ఉల్లంఘిస్తే రూ.50,000, మూడోసారి ఉల్లంఘిస్తే రూ.1,00,000 భారీ జరిమానాతో పాటు ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష కూడా పడవచ్చు. కొన్ని సందర్భాలలో జరిమానా, జైలు శిక్ష రెండూ వర్తించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: మీరు హైవేపై కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!

ప్రతి వినియోగదారుడు తమ హక్కులను పూర్తిగా వినియోగించుకుని, MRP కంటే అధిక ధరలకు వ్యతిరేకంగా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని అధికారులు చెబుతున్నారు. తద్వారా ఇటువంటి అక్రమ వ్యాపార పద్ధతులను సమర్థవంతంగా అరికట్టి, న్యాయమైన వ్యాపార వాతావరణాన్ని ప్రోత్సహించవచ్చు. అందుకే ఎవరైనా ఎంఆర్‌పీ కంటే ఎక్కువ రేటుకు అమ్మినట్లయితే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని గుర్తించుకోండి.

Income Tax: మీరు మీ బంధువుల ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారా? ఇక కొత్త నిబంధనలు

Lifestyle: మీకు మద్యం తాగే అలవాటు ఉందా..? ఈ తప్పు అస్సలు చేయకండి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us