Top Taxpayers: భారత్‌లో అత్యధికంగా పన్నును చెల్లించేంది ఎవరో తెలుసా.. వారి పేరు వింటే మీరు కూడా షాక్ అవుతారు..

|

Feb 06, 2023 | 7:15 PM

బడ్జెట్‌లో ప్రభుత్వం ఆదాయపు పన్ను శ్లాబ్ రేట్లను పెంచింది. దీని వల్ల ప్రజలు ఎంతో ఊరట పొందుతున్నారు. అదే సమయంలో, 2023 బడ్జెట్ ప్రసంగంలో కొత్త పన్ను స్లాబ్‌లో సంవత్సరానికి రూ. 7 లక్షల ఆదాయంపై ఇప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే, దేశ వ్యాప్తంగా అత్యధిక ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారో ఓ సారి తెలుసుకుందాం..

Top Taxpayers: భారత్‌లో అత్యధికంగా పన్నును చెల్లించేంది ఎవరో తెలుసా.. వారి పేరు వింటే మీరు కూడా షాక్ అవుతారు..
Taxpayers
Follow us on

2023 బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల సమర్పించింది. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ఆదాయపు పన్ను శ్లాబ్ రేట్లను పెంచింది. దీని వల్ల ప్రజలు ఎంతో ఊరట పొందుతున్నారు. అదే సమయంలో, 2023 బడ్జెట్ ప్రసంగంలో, కొత్త పన్ను స్లాబ్‌లో సంవత్సరానికి రూ. 7 లక్షల ఆదాయంపై ఇప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే, దేశ వ్యాప్తంగా అత్యధిక ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఎవరున్నారో ఓ సారి తెలుసుకుందాం..

వీరు చెల్లించే మొత్తం భారీగా ఉంటుంది. ఇందులో దేశీ కంపెనీలు మాత్రమే ఉండటం విశేషం. భారతదేశంలో చాలా పెద్ద కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయి. వీటిలో కొన్ని కంపెనీలు కూడా అలాంటివే.. వీటి వ్యాపారం దేశ విదేశాల్లో విస్తృతంగా వ్యాపించింది. మరోవైపు, భారతదేశంలో గరిష్టంగా పన్నును దాఖలు చేసే అటువంటి కంపెనీల గురించి ఈ రోజు మేము మీకు అందించబోతున్నాం. భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లిస్తున్న కంపెనీల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

పన్ను చెల్లింపుదారుల ఏస్ ఈక్విటీలో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, 2022 ఆర్థిక సంవత్సరంలో (FY22) భారతదేశంలోని టాప్ 15 పన్ను చెల్లింపుదారుల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. 2022 ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 5,000 కోట్ల పన్ను చెల్లించిన లిస్టెడ్ కంపెనీలు 15 ఉండగా.. కనీసం రూ. 1,000 కోట్ల పన్ను చెల్లించిన మొత్తం 60 కంపెనీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

రిలయన్స్..

FY 2022 గణాంకాల ప్రకారం, అత్యధిక పన్ను చెల్లింపుదారులలో బిలియనీర్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రూ. 16,297 కోట్ల పన్ను చెల్లించింది. ఎస్‌బీఐ రూ.13,382 కోట్ల పన్ను చెల్లించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ.13,238 కోట్ల పన్ను చెల్లించింది. ఇది కాకుండా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నాల్గవ స్థానంలో ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 12,722 కోట్ల పన్నును డిపాజిట్ చేసింది. కాగా వేదాంత రూ.9,255 కోట్ల పన్ను చెల్లించింది.

టాటా స్టీల్

జేఎస్‌డబ్ల్యూ స్టీల్ రూ.8,807 పన్ను చెల్లించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏడవ స్థానంలో ఉంది. కంపెనీ రూ. 8,562 కోట్ల పన్ను చెల్లించింది. దీని తర్వాత టాటా స్టీల్ పేరు. టాటా స్టీల్ రూ.8,478 కోట్ల పన్ను చెల్లించింది. అదే సమయంలో ఐసీఐసీఐ బ్యాంకు రూ.8,457 కోట్లను పన్నుగా చెల్లించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) పదో స్థానంలో ఉంది. ఎల్‌ఐసీ రూ.8,013 కోట్ల పన్ను చెల్లించింది.

ఇన్ఫోసిస్

ఆ తర్వాతి స్థానాల్లో ఇన్ఫోసిస్ రూ.7,964 కోట్లు, కోల్ ఇండియా రూ.6,238 కోట్లు, హిందాల్కో ఇండస్ట్రీస్ రూ.5,373 కోట్లు, ఐటీసీ రూ.5,237 కోట్లు, ఎన్టీపీసీ రూ.5,047 కోట్లు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం