మనం కష్టించి సంపాదించే ఆదాయంపై పన్ను రాయితీ కోసం వివిధ పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటాం. ముఖ్యంగా ఆదాయపు పన్ను శాఖ నిబంధన 80 సీ కింద చెల్లుబాటు అయ్యే పథకాల కోసం చూస్తూ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా మీ ఆదాయంపై మరింత ఆదాయపు పన్నును ఆదా చేసేందుకు కొన్ని పన్ను ఆదా పథకాలను పథకాలను మీ ముందుకు తీసుకువచ్చాం. బ్యాంకులు, పబ్లిక్, ప్రైవేట్, పెట్టుబడిదారుల కోసం పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లను అందిస్తాయి. దీని ద్వారా పెట్టుబడిదారులు సెక్షన్ 80 C కింద సంవత్సరానికి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు ఆదా చేయవచ్చు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు బ్యాంకుల పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో చివరిగా పెట్టుబడి పెడతారు. అలాగే ఆదాయపు పన్నును ఆదా చేయడానికి పన్ను చెల్లింపుదారులు పోస్ట్ ఆఫీస్ అందించే కొన్ని పథకాలను కూడా ఎంచుకోవచ్చు. ఇవి ఐదేళ్ల కాలవ్యవధిని కలిగి ఉంటాయి. అలాగే ఇవి కూడా భారత ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద చెల్లుబాటు అవుతాయి. కొన్ని బ్యాంక్ ఎఫ్‌డీలు, పోస్టాఫీసులతో వడ్డీ రేట్ల మధ్య వ్యత్యాసాన్ని ఓ సారి తెలుసుకుందాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటును సవరించినప్పటి నుంచి అనేక బ్యాంకులు పన్ను ఆదా చేయడానికి ఎఫ్‌డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. మే 2022 నుంచి ఆర్‌బీఐ రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల ద్వారా 6.50 శాతానికి సవరించింది. దీంతో బ్యాంకులు తమ ఎఫ్‌డీ రేట్లను సవరించాయి. ప్రస్తుతం డీసీబీ బ్యాంక్ అత్యధికంగా 8.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అయితే యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ 7.75 శాతం రేటును అందిస్తున్నాయి. యస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 7.5 శాతం రేటును ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్‌బీ బ్యాంక్ వరుసగా 7.15 శాతం, 7.5 శాతం, 7 శాతం వడ్డీ రేట్లను అందిస్తాయి. ఐదు సంవత్సరాల ఎఫ్‌డీ కోసం ఎస్‌బీఐ వడ్డీ రేటు 6.50 శాతంగా ఉంటుంది.
పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్‌సీ) అనేది స్థిర-ఆదాయ పెట్టుబడి పథకం. దీనికి కేంద్రం మద్దతు ఇస్తుంది. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. ప్రస్తుత వడ్డీ రేటు 7 శాతంగా. ప్రారంభ పెట్టుబడిగా రూ.100 కూడా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఈ పథకానికి గరిష్ట పరిమితి లేదు.
పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ ఖాతా అనేది బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే ఉంటుంది. ఈ త్రైమాసికంలో ఐదు సంవత్సరాల టర్మ్ డిపాజిట్ వడ్డీ రేటు 7 శాతంగా ఉంటుంది. కనీస పెట్టుబడి రూ. 1000గా ఉంటే గరిష్ట పెట్టుబడికి మాత్రం పరిమితి లేదు. ఖాతాదారుడి పొదుపు ఖాతాలో వార్షిక వడ్డీని జమ చేస్తారు. భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చే ఇతర చిన్న పొదుపు పథకాల మాదిరిగానే ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేటు సవరిస్తారు.
సీనియర్ సిటిజన్లు వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. కనీస పెట్టుబడిగా రూ.1000 ఉంటే, గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.15 లక్షలుగా ఉంది. ఈ పెట్టుబడి ఐదేళ్ల కాల వ్యవధిని కలిగి ఉంది. ఈ పథకం అదనపు మూడేళ్లపాటు మెచ్యూరిటీకి చేరుకున్న తర్వాత పునరుద్ధరించబడుతుంది. జనవరి-డిసెంబర్ త్రైమాసికానికి కేంద్రం తన వడ్డీ రేటును సవరించిన తర్వాత సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ డిపాజిట్లపై సంవత్సరానికి ప్రస్తుతం 8 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి