Recurring Deposit: మీ ఆదాయం నుంచి నెల నెలా కొంత మొత్తం పొదుపు చేయాలనుకుంటే రికరింగ్ డిపాజిట్(RD) అందుకు సరైనదని చెప్పవచ్చు. దీని ద్వారా మీ సొమ్మును సురక్షితంగా పొదుపు చేసుకోగలుగుతారు. అదేవిధంగా మీ భవిష్యత్ ఆర్ధిక అవసరాల కోసం డబ్బు జాగ్రత్త చేసుకోగలుగుతారు. ఆర్డీ లలో ఉండే సౌలభ్యం ఏమిటంటే..మీరు చిన్న చిన్న మొత్తాలలో పొడుపు చేసుకోవచ్చు. దానికి రికరింగ్ గా వడ్డీ పొందవచ్చు. పొడుపు ఖాతా కంటే.. ఇది చాలా ఉత్తమమైనది. రికరింగ్ డిపాజిట్ చేయాలనుకుంటే.. ఏ బ్యాంకులో వడ్డీరేటు ఎక్కువ వస్తుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ వడ్డీ వచ్చే బ్యాంకులో డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో మీకు వచ్చే సొమ్ము అంత ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు యస్ బ్యాంక్ ప్రస్తుతం RD పై 6.50% మరియు IDFC ఫస్ట్ ఇండియా బ్యాంక్ 6% వరకు వడ్డీని అందిస్తోంది. అదే విధంగా ఆర్డీ గురించి.. దానిపై వివిధ బ్యాంకులు ఇస్తున్న వడ్డీ గురించి తెలుసుకుందాం.
RD అంటే ఏమిటి?
రికరింగ్ డిపాజిట్ లేదా RD మీకు పెద్ద మొత్తాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది. మీరు దీనిని పిగ్గీ బ్యాంక్ లాగా ఉపయోగించవచ్చు. జీతం వచ్చినప్పుడు ప్రతి నెలా మీరు నిర్ణీత మొత్తాన్ని అందులో జమ చేయడం ద్వారా పరిపక్వత సమయంలో మీ చేతిలో పెద్ద మొత్తాన్ని అందుకోగలుగుతారు.
మెచ్యూరిటీ కాలం ఎంత?
దీని పరిపక్వత(మెచ్యూరిటీ) కాలం సాధారణంగా 6 నెలల నుండి 10 సంవత్సరాల మధ్య ఉంటుంది. అయితే, దేశంలోని అతి పెద్ద బ్యాంక్ SBI లో, మీరు కనీసం 1 సంవత్సరం పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
మీరు ఎంత పెట్టుబడి పెట్టడం ద్వారా దీనిని ప్రారంభించవచ్చు?
మీరు ఈ RD స్కీమ్‌లో నెలకు కనీసం రూ.100 పెట్టుబడి పెట్టవచ్చు. మీరు ఇంతకు మించిన మొత్తాన్ని 10 గుణిజాలలో జమ చేయవచ్చు. గరిష్ట డిపాజిట్ మొత్తానికి పరిమితి లేదు.
నేను ఎక్కడ RD ఖాతాను తెరవగలను?
RD అనేది ఒక రకమైన చిన్న పొదుపు పథకం. ఏ వ్యక్తి అయినా దాని ఖాతాను ఏ బ్యాంకులోనైనా తెరవవచ్చు. ఈ ఖాతాలను అన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ బ్యాంకులలో తెరవవచ్చు.
ఏ బ్యాంకు 1 సంవత్సరం RD కి ఎంత వడ్డీ ఇస్తోంది
బ్యాంక్ | వడ్డీ రేటు ( %లో) |
ఇండస్ ఇండ్ బ్యాంక్ | 6.00 |
పోస్ట్ ఆఫీస్ | 5.80 |
యస్ బ్యాంక్ | 5.75 |
IDFC ఫస్ట్ ఇండియా | 5.50 |
SBI | 5.00 |
పంజాబ్ నేషనల్ బ్యాంక్ | 5.00 |
ICICI | 4.90 |
ఏ బ్యాంకు 3 సంవత్సరాల RD కి ఎంత వడ్డీ ఇస్తోంది
బ్యాంక్ | వడ్డీ రేటు ( %లో) |
యస్ బ్యాంక్ | 6.25 |
IDFC ఫస్ట్ ఇండియా | 6.00 |
ఇండస్ ఇండ్ బ్యాంక్ | 6.00 |
పోస్ట్ ఆఫీస్ | 5.80 |
SBI | 5.30 |
ICICI | 5.15 |
పంజాబ్ నేషనల్ బ్యాంక్ | 5.00 |
ఏ బ్యాంకు 5 సంవత్సరాల RD కి ఎంత వడ్డీ ఇస్తోంది
బ్యాంక్ | వడ్డీ రేటు ( %లో) |
యస్ బ్యాంక్ | 6.50 |
IDFC ఫస్ట్ ఇండియా | 6.00 |
పోస్ట్ ఆఫీస్ | 5.80 |
ఇండస్ ఇండ్ బ్యాంక్ | 5.50 |
SBI | 5.40 |
ICICI | 5.35 |
పంజాబ్ నేషనల్ బ్యాంక్ | 5.25 |