Tourism Projects: భారత్‌లో పర్యాటక వృద్ధికి కీలక చర్యలు.. ఏకంగా 40 ప్రాజెక్టులకు ఆమోదం

|

Nov 30, 2024 | 1:49 PM

భారతదేశంలో పర్యాటక రంగం ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. అయితే పర్యాటక ప్రదేశాలు అద్భుతంగా ఉన్నా వాటి గురించి పర్యాటకుల తెలియకపోవడమే పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కీలక చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో పర్యాటక రంగ వృద్ధి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Tourism Projects: భారత్‌లో పర్యాటక వృద్ధికి కీలక చర్యలు.. ఏకంగా 40 ప్రాజెక్టులకు ఆమోదం
Tourism Projects
Follow us on

భారతదేశంలో స్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, పర్యాటకుల రద్దీని సమతుల్యం చేయడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ రూ.3,295 కోట్లకు పైగా విలువైన 40 ప్రాజెక్టులను ఆమోదించింది . ముఖ్యంగా ఎవరికీ తెలియని పర్యాటక ప్రాంతాలను ఐకానిక్ సైట్‌లుగా మార్చే లక్ష్యంతో ఉంది. 23 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టులు స్థానిక ఆర్థిక వ్యవస్థలను ఉత్తేజపరిచేందుకు, పర్యాటక మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు. అభివృద్ధి చెందని ప్రాంతాలపై దృష్టి సారించడం ద్వారా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో రద్దీని తగ్గించడానికి గతంలో చేసిన ప్రయత్నాలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక సహాయాన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ మార్గదర్శకాలను తెలిపింది. 

ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ డెవలప్‌మెంట్ కోసం ప్రతిపాదనలను సమర్పించాల్సిందిగా రాష్ట్రాలకు స్పష్టం చేసింది. అక్టోబర్ 15, 2024 నాటికి మొత్తం రూ. 8,000 కోట్లకు పైగా 87 ప్రతిపాదనలు అందాయి. వీటిని మూల్యాంకనం చేసిన తర్వాత 40 ప్రాజెక్టులను షార్ట్‌లిస్ట్ చేసి నిధుల కోసం అనుమతి ఇచ్చారు. ఎంపిక చేసిన ప్రాజెక్టులు 50 సంవత్సరాల వరకు దీర్ఘకాలిక వడ్డీ రహిత రుణాల ఇన్ఫ్యూషన్‌తో అభివృద్ధి చేస్తారు.రంగ్ ఘర్ (అస్సాం), మత్స్యగంధ సరస్సు (బీహార్), టౌన్ స్క్వేర్ (గోవా) మరియు ఓర్చా (మధ్యప్రదేశ్) ఉన్నాయి. 

ఈ ప్రాజెక్టుల వద్ద పర్యాటక అనుభవాలను మెరుగుపరచడంతో పాటు ఉపాధిని సృష్టించడం, స్థిరమైన పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానిక ఆర్థిక వృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తికి కాలక్రమం రెండేళ్లుగా సెట్ చేశఆరు. మార్చి 2026 నాటికి నిధులు విడుదల చేస్తారు. ఈ వ్యూహాత్మక విధానం ద్వారా పర్యాటక రంగంలో ప్రాంతీయ అసమానతలను తగ్గించడంతో భారతదేశానికి విస్తృత పర్యాటక వృద్ధికి మద్దతు ఇవ్వాలని పర్యాటక మంత్రిత్వ శాఖ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి