EPF Interest Rate: పీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపుపై నిర్మలా సీతారామన్ కు లేఖ.. బీజేపీ నిజస్వరూపం ఇదేనంటూ ఎంపీ ఫైర్

|

Mar 13, 2022 | 1:09 PM

EPF Interest Rate: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పై చెల్లించే వడ్డీ రేటును తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ ఎంపీ తప్పుపట్టారు. బీజేపీ విధానాలపై ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘాటు లేఖ రాశారు. ఎన్నికలు ముగిశాక వడ్డీ రేటు తగ్గించటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

EPF Interest Rate: పీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపుపై నిర్మలా సీతారామన్ కు లేఖ.. బీజేపీ నిజస్వరూపం ఇదేనంటూ ఎంపీ ఫైర్
Epf Rate Cut
Follow us on

EPF Interest Rate: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పై చెల్లించే వడ్డీ రేటును తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ ఎంపీ తప్పుపట్టారు. కేరళకు చెందిన సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వం ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) కు లేఖ రాశారు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు(Central Board of trustees) తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ఈ నిర్ణయాన్ని కార్మిక సంఘాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసిస్తున్నాయి. ఈపీఎఫ్ వడ్డీ రేటును తగ్గించడం వల్ల ఆరు కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు ఆర్థికంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన మరుసటి రోజే కోట్ల మంది ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరించడమే భారతీయ జనతా పార్టీ నిజ స్వరూపమని ఆయన విమర్శించారు. సామాజిక భద్రత కోసం కోట్లాదిమంది ఉద్యోగులు, కార్మిక వర్గం డిపాజిట్ చేసుకునే భవిష్యనిధిపై వడ్డీ రేటును తగ్గించడం ఎన్డీఏ  విధానాలను అద్దం పడుతోందని మండిపడ్డారు.  ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉద్యోగులకు ఈపీఎఫ్ సంస్థ షాక్ ఇచ్చింది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వడ్డీ రేటును 4 దశాబ్దాల కనిష్ఠ స్థాయికి తగ్గించింది. ఈ వడ్డీ రేటు 1977-78 ఆర్థిక సంవత్సరం తర్వాత అతి తక్కువ వడ్డీ రేటు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2021-22కి, ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేటు(interest rate) 8.1 శాతానికి తగ్గించారు. ఈ మేరకు ట్రస్టీలు ఆర్థికశాఖకు ఏకగ్రీవంగా ఆమోదించిన ఓ తీర్మానం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సారథ్యంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఈ తీర్మానాన్ని పంపనున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని ర్యాటిఫై చేసి.. కొత్త వడ్డీ రేటు అమలులోకి తీసుకొస్తుంది. ఏప్రిల్ 1 నుంచి ఆరంభం అయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరంలో కుదించిన వడ్డీ రేటు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి..

Gowtham Adani: మరణాన్ని 15 అడుగుల నుంచి చూశానన్న గౌతమ్ అదానీ.. ఇంతకీ ఈ దిగ్గజ వ్యాపారవేత్తకు ఏమైంది..

Home Loan: హోమ్ లోన్ ఈఎంఐ చెల్లించలేక పోతే ఏం జరుగుతుంది.. బ్యాంకులు ఏం చేస్తాయి..?