స్పోర్ట్స్ బైక్ లను యువకులు అమితంగా ఇష్టపడుతుంటారు. ఎంత ఖర్చైనా వెనక్కి తగ్గకుండా వాటిని కొనుగోలు చేస్తుంటారు. కొంతమంది ప్రొఫెషనల్ బైక్ రేసింగ్ పైనా యువత ఆసక్తి చూపుతున్నారు. అందుకోసం ప్రత్యేక ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. అందుకోసం మంచి రేసింగ్ బైక్ లను కూడా చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది రేసింగ్ కోసం కాకపోయినా, మంచి స్పోర్ట్స్ బైక్ మెయింటేన్ చేయాలని భావించే వారు ఉంటున్నారు. అటువంటి బైక్ ప్రియుల కోసం జపాన్ కు చెందిన కవాసకి తన ప్రీమియం మోడల్ మోటార్ సైకిల్ ను మన దేశంలో లాంచ్ చేసింది. కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ పేరిట దీనిని ఆవిష్కరించింది. దీనిలో శక్తివంతమైన ఇంజిన్ తో పాటు అత్యాధునిక ఫీచర్లు ఫీచర్లు.. సూపర్ సోలిడ్ డిజైన్ ఉంది. కవాసకి నుంచి ఇప్పటికే అందుబాటులో ఉన్న నింజా 650, నింజా 400 స్పోర్ట్స్ బైక్ కు తోడు ఈ నింజా జెడ్ ఎక్స్-4ఆర్ ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ బైక్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి వివరాలు తెలుసుకుందాం..
కవాసకీ నింజా జెడ్ ఎక్స్-4ఆర్ మోటార్ సైకిల్ సింగిల్ వేరింయట్లో వచ్చింది. అలాగే సింగగిల్ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంది. అది కూడా మెటాలిక్ బ్లాక్ రంగులో లభ్యమవుతోంది. ఇండియాలోని కవాసకి పోర్ట్ ఫోలియోలాగే ఈ బైక్ కూడా రేసింగ్ డీఎన్ఏతోనే మన దేశంలో అడుగుపెట్టింది. దీని హ్యాండ్లింగ్ అంతాకూడా నింజా జెడ్ఎక్స్-10ఆర్, నింజా జెడ్ఎక్స్-6ఆర్ మాదిరిగానే ఉంటుందని కవాసకీ ప్రకటించింది. దీని ప్రారంభ ధర రూ. 8.49లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుందని పేర్కొంది.
కవాసకీ నింజా జెడ్ ఎక్స్-4ఆర్ మోటార్ సైకిల్ లో లిక్విడ్ కూల్డ్ 399సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 80హెచ్ పీ పవర్, 39ఎన్ఎం గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. 6 గేర్లతో ఈ బైక్ ఉంటుంది. మూడు రైడింగ్ మోడ్లను కలిగి ఉంటుంది. స్పోర్ట్, రోడ్, రెయిన్ వంటి రైడింగ్ మోడ్లు రైడర్ కి మంచి డ్రైవింగ్ అనుభూతినిస్తుంది. ఎటువంటి ప్రాంతాల్లోనైనా సులువుగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.
కవాసకీ నింజా జెడ్ ఎక్స్-4ఆర్ మోటార్ సైకిల్ ఫీచర్లు పరిశీలస్తే.. దీనిలో 4.3 అంగుళాల టీఎఫ్టీ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, నోటిఫికేషన్ అలర్ట్, ముందు వెనుకా ఎల్ఈడీ లైటింగ్ ఉంటుంది. డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..