Kadapa Airport: కడప విమానాశ్రయానికి రాజదర్పం.. గండికోట తరహాలో టెర్మినల్ భవనం..

| Edited By: Shaik Madar Saheb

May 06, 2024 | 6:06 PM

మన రాష్ట్రంలోని కడప విమానాశ్రయంలో త్వరలో కొత్త టెర్మినల్ భవనాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాయలసీమతో పాటు మన రాష్ట్ర ప్రజలందరికీ మరిన్ని సేవలను అందించడం కోసం ఎయిర్ పోర్ట్ ను విస్తరిస్తున్నారు. విశ్వసనీయమైన సమాచారం ప్రకారం.. ఈ టెర్మినల్ భవనం రోడ్‌మ్యాప్ ను చారిత్రక గండికోట ఫోర్ట్ నుంచి తీసుకుంటున్నారు. ఆ కోటలోని తోరణాలు, వివిధ ఆకారాలను దీనిలోనూ నిర్మించనున్నారు.

Kadapa Airport: కడప విమానాశ్రయానికి రాజదర్పం.. గండికోట తరహాలో టెర్మినల్ భవనం..
Kadapa Airport New Terminal Building
Follow us on

మన చరిత్ర, సంస్కృతికి నిదర్శనంగా వివిధ కట్టడాలు, నిర్మాణాలు నిలుస్తాయి. వాటిని కాపాడుకోవడంతో పాటు భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఇందుకోసం ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే ఆ చారిత్రక కట్టడాల నమూనాల రూపంలో కొత్త భవనాలు నిర్మిస్తున్నాయి. అందులో భాగంగా కడప విమానాశ్రయంలోని కొత్త టెర్మినల్ భవనాన్ని గండికోటలోని కోట నమూనాలో నిర్మించనున్నారు.

గండికోట ఫోర్ట్ తరహాలో..

మన రాష్ట్రంలోని కడప విమానాశ్రయంలో త్వరలో కొత్త టెర్మినల్ భవనాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాయలసీమతో పాటు మన రాష్ట్ర ప్రజలందరికీ మరిన్ని సేవలను అందించడం కోసం ఎయిర్ పోర్ట్ ను విస్తరిస్తున్నారు. విశ్వసనీయమైన సమాచారం ప్రకారం.. ఈ టెర్మినల్ భవనం రోడ్‌మ్యాప్ ను చారిత్రక గండికోట ఫోర్ట్ నుంచి తీసుకుంటున్నారు. ఆ కోటలోని తోరణాలు, వివిధ ఆకారాలను దీనిలోనూ నిర్మించనున్నారు.

ఆనాటి కళకు ప్రతిబింబం..

కోట ముందు భాగంతో పాటు దాని పైభాగంలో ఉండే నాలుగు మినార్ల తరహాలోనే కొత్త టెర్మినల్ భవనాన్ని కట్టనున్నారు. క్రీ.శ.1123లో కోటలోని నాలుగు మినార్లను నిర్మించేందుకు ఎర్ర ఇసుకరాయిని ఉపయోగించారు. దానిని ఇప్పుడు కొత్తగా టెర్మినల్ భవనానికి నిర్మించనున్న ఐదు టవర్లలోనూ వాడనున్నారు. విమానాశ్రయంలోని టవర్లలోని పారాపెట్‌లు (కోటల గోడలు), లాటిస్‌లు కూడా ఇప్పటికే ఉన్న నాలుగు మినార్ల మాదిరిగా ఉంటాయి. లాటిస్‌ అంటే పొడవాటి సన్నని చెక్క ముక్కలు, లోహంతో తయారు చేయబడిన నిర్మాణాలు, వాటి మధ్య వజ్రం ఆకారంలో ఉండే ఖాళీలు ఉంటాయి.

అద్భుత కలయిక..

లాటిస్‌లు, పారాపెట్‌లతో పాటు గండికోట పోర్ట్ లోని ఆర్చ్‌లు, కార్నిసెస్ ఆకారాలు కూడా కొత్త టెర్మినల్ భవనంలో ఏర్పాటు చేస్తారు. సాంప్రదాయ, ఆధునికత అద్భుత కలయికను కొత్త టెర్మినల్ భవనం నిర్మాణంలో చూడవచ్చు. ఇక్కడకు వచ్చే ప్రయాణికులు ఈ భవనం కొత్త అనుభూతిని ఇస్తుంది. చరిత్ర, కళ, సంస్కృతి తదితర వాటిని కళ్ల ముందు ఉంచుతుంది.

ఎయిర్ పోర్టుకు రద్దీ..

కడప విమానాశ్రయానికి ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. దానికి అనుగుణంగా కొత్త టెర్మినల్ భవనం నిర్మిస్తున్నారు. దీనిని సుమారు 16,455 చదరపు మీటర్ల విస్తీర్ణంతో కట్టనున్నారు. రద్దీ సమయాల్లో (350 అరైవల్ ప్యాసింజర్స్, 350 డిపార్చర్ ప్యాసింజర్స్) 700 మంది ప్రయాణీకులు వేచి ఉండటానికి వీలుగా దీనిని రూపొందించనున్నారు.

ఇతర సౌకర్యాలు..

టెర్మినల్ భవనంలోనే పార్కింగ్ ప్రాంతం ఏర్పాటు చేయనున్నారు. అలాగే సర్వీస్ రోడ్డుతో జాతీయ రహదారి నుంచి కొత్త అప్రోచ్ రోడ్డు నిర్మిస్తారు. ప్రయాణికులను అవసరమైన అనుబంధ సౌకర్యాలు కూడా కల్పించనున్నారు. అలాగే ల్యాండ్‌స్కేపింగ్, యుటిలిటీ బ్లాక్‌ను కూడా ఏర్పాటు చేస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..