Joy E-Bike: లక్ష స్కూటర్ల అమ్మకాలతో జోష్.. మరో లక్ష అమ్మేలా అద్భుత ఆఫర్లు.. రూ. 30వేల వరకూ ప్రయోజనాలు

ఈ కంపెనీ నుంచి జాయ్ ఈ-బైక్ బ్రాండ్ పేరుతో లాంచ్ అవగా.. దానిపై వినియోగదారుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మార్కెట్లోకి వచ్చిన అనతి కాలంలో అద్భుతమైన సేల్స్ రాబట్టింది. ఏకంగా ఒక లక్ష వాహనాలను విక్రయించింది. ఈ సందర్భంగా కచ్చితంగా కంపెనీ నుంచి వచ్చిన లక్షవ యూనిట్ ను వడదోరలోని ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కర్మాగారం నుంచి విడుదల చేసింది.

Joy E-Bike: లక్ష స్కూటర్ల అమ్మకాలతో జోష్.. మరో లక్ష అమ్మేలా అద్భుత ఆఫర్లు.. రూ. 30వేల వరకూ ప్రయోజనాలు
Wardwizard Mihos E Bike

Updated on: Feb 25, 2024 | 6:53 AM

మన దేశంలో విద్యుత్ శ్రేణి వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇవి లోకల్ అవసరాలకు సరిగ్గా సరిపోతుండటం.. ఇంటి పనులను చక్కబెట్టుకునేందుకు మహిళలు కూడా వినియోగిస్తుండటంతో వీటి వినియోగం పెరిగింది. ఈ క్రమంలో చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. వాటిల్లో వార్డ్‌విజార్డ్ ఒకటి. ఈ కంపెనీ నుంచి జాయ్ ఈ-బైక్ బ్రాండ్ పేరుతో లాంచ్ అవగా.. దానిపై వినియోగదారుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మార్కెట్లోకి వచ్చిన అనతి కాలంలో అద్భుతమైన సేల్స్ రాబట్టింది. ఏకంగా ఒక లక్ష వాహనాలను విక్రయించింది. ఈ సందర్భంగా కచ్చితంగా కంపెనీ నుంచి వచ్చిన లక్షవ యూనిట్ ను వడదోరలోని ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కర్మాగారం నుంచి విడుదల చేసింది. అంతేకాక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జాయ్ ఈ-బైక్ పై అద్భుతమైన రాయితీలను ప్రకటించింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

కంపెనీ ఎప్పుడు ప్రారంభమైందంటే..

ఈ సంస్థ 2016 లో ఎలక్ట్రిక్ స్కూటర్లలో తన మొదటి ఉత్పత్తిని ప్రారంభించింది. బీఎస్ఈలో భారతదేశం నుంచి మొట్టమొదటి ఈవీ లిస్టెడ్ కంపెనీగా వార్డ్‌విజార్డ్ 2018లో నమోదైంది. ఈ కంపనీ నుంచి మొదట్లో లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, బటర్‌ఫ్లైని పరిచయం చేసింది. ప్రస్తుతం, కంపెనీ 10 మోడళ్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. వీటిలో హై, లో-స్పీడ్ వేరియంట్‌లు ఉన్నాయి. 750కి పైగా టచ్‌పాయింట్‌ల నెట్‌వర్క్ ను ఈ కంపెనీ కలిగి ఉంది.

మైలురాయి సందర్భంగా ఆఫర్లు..

కాగా ఇప్పుడు ఈ కంపెనీ నుంచి లక్షవ యూనిట్ మైహూస్ మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని, కంపెనీ తన కస్టమర్ల కోసం ప్రత్యేక ప్రయోజనాలు, ఉచిత బీమాను అందిస్తూ ఆఫర్‌లను ప్రకటించింది. ఈ ఆఫర్‌లు మార్చి 31, 2024 వరకు భారతదేశంలోని అన్ని అధీకృత జాయ్ ఇ-బైక్ డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రత్యేక ప్రయోజనాలలో భాగంగా, కంపెనీ మైహోస్, వోల్ఫ్+, జెన్ నెక్ట్స్ నాను+ మోడళ్లపై రూ.30,000 వరకు తగ్గింపు, ఉచిత బీమాను అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరో లక్ష లక్ష్యం..

ఈ విజయాన్ని గురించి వార్డ్‌విజార్డ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ యతిన్ గుప్తే మాట్లాడుతూ దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్‌గా వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్‌ను ప్రోత్సహించినందుకు తమ కస్టమర్‌లు, వాటాదారులకు వారి తిరుగులేని మద్దతుకు తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ లక్ష విక్రయాల మైలురాయి మా విభిన్న ఉత్పత్తుల శ్రేణి నాణ్యతను నొక్కి చెబుతుందని స్పష్టం చేశారు. అంతేకాక రానున్న కాలంలో కస్టమర్ డిమాండ్‌లను తీర్చడం కోసం మా స్థిరమైన అంకితభావాన్ని గుర్తుచేస్తుందని వివరించారు. తమ లక్ష్యం 2026 నాటికి రెండు లక్షల మైలురాయిని చేరుకోవడమేనని స్పష్టం చేశారు.

మరిన్ని ఉత్పత్తులు..

వార్డ్ విజార్డ్ దాని మొదటి హైడ్రోజన్-ఆధారిత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం నమూనాను కూడా ఆవిష్కరించింది. ప్రస్తుత ఉత్పత్తి శ్రేణిని ప్రదర్శించింది. ఇందులో హై, లో -స్పీడ్ మోడల్‌లు, ‘జాయ్ ఇ-రిక్’ బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..