- Telugu News Business Jio users will be able to watch JioHotstar for 90 days for just Rs 299, along with these benefits
Jio: జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.299తో 90 రోజుల హాట్‌స్టార్.. మరెన్నో బెనిఫిట్స్!
Jio Plan: టెలికాం రంగంలో రిలయన్స్ జియో దూసుకుపోతోంది. వినియోగదారుల కోసం కొత్త కొత్త ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువస్తూ మరింతగా ఆకట్టుకుంటోంది. ఇక క్రెడిట్ మ్యాచ్‌ల సీజన్‌లో చౌకైన డేటా ప్లాన్స్, జియోహట్‌స్టాట్ కోసం చౌకైన ప్లాన్స్‌ను తీసుకువస్తోంది. ఇప్పుడు క్రెడిట్ అభిమానుల కోసం చౌకైన ప్లాన్ ఉంది..
Updated on: Mar 17, 2025 | 10:12 PM



ఈ ప్లాన్ తో మీరు JioTV కి ఉచిత యాక్సెస్ వంటి కొన్ని డిజిటల్ ప్రయోజనాలను కూడా పొందుతారు. దీని ద్వారా మీరు టీవీ ఛానెల్స్, షోలను చూడవచ్చు. 50GB Jio AI క్లౌడ్ స్టోరేజ్. ఇది ఫైల్ బ్యాకప్, డేటా స్టోరేజ్ కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.మీరు డేటాతో కూడిన ప్లాన్ కోరుకుంటే, జియో రూ. 2,025 ప్లాన్ మంచిది. ఇది 2.5GB రోజువారీ డేటా, అపరిమిత కాల్స్, 200 రోజుల పాటు SMS లను అందిస్తుంది.

ఈ ఆఫర్ ఎలా పొందాలి?: ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి కస్టమర్లు మార్చి 17 – మార్చి 31, 2025 మధ్య జియో సిమ్‌ను కొనుగోలు చేయాలి. వారి ప్రస్తుత జియో నంబర్‌ను రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ చెల్లించి రీఛార్జ్ చేసుకోవాలి.

ప్రస్తుత జియో కస్టమర్లు రూ. 299 రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5GB డేటా: కొత్త జియో కస్టమర్లు రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో కొత్త జియో సిమ్ కొనండి. ప్రయోజనాలను తెలుసుకోవడానికి కస్టమర్లు 60008-60008 కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. ఇక్కడ మీరు ప్లాన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందుతారు.

జియో ప్లాన్ నియమాలు: మార్చి 17 కి ముందు రీఛార్జ్ చేసుకునే కస్టమర్లు రూ. 100 యాడ్-ఆన్ ప్యాక్ ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. JioHotstar ఉచిత ప్యాక్ మార్చి 22, 2025 క్రికెట్ సీజన్ మొదటి మ్యాచ్ రోజు నుండి 90 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది. ఈ ఆఫర్‌ను పొందడానికి, ఇప్పుడే jio.comని సందర్శించండి లేదా సమీపంలోని Jio స్టోర్‌ను సందర్శించండి.




