ఈ రోజుల్లో ఇంటర్నెట్ లేని ఫోన్ అంటూ ఉండదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు స్మార్ట్ ఫోన్‌లతో గడిపేవారు చాలా మందే ఉన్నారు. ప్రతి ఒక్కరి ఫోన్‌లలో ఇంటర్నెట్, అపరిమిత కాల్స్ ఉంటున్నాయి. అయితే రిలయన్స్ జియో కస్టమర్లను పెంచుకునేందుకు రకరకాల రీఛార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. తక్కువ ధరల్లోనే రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తెస్తుంది. రిలయన్స్ జియో రూ. 296 ప్లాన్ మీకు ఒక నెల వాలిడిటీ, తక్కువ ధరలో అపరిమిత కాలింగ్, డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు 30 రోజుల చెల్లుబాటులో ఉంటుంది. ప్లాన్ ఫీచర్‌లతో మీ 30 రోజుల డేటా, కాలింగ్ అవసరాలు సులభంగా నెరవేరుతాయి.
జియో రూ. 296 ప్రీపెయిడ్ ప్లాన్
మంచి రీఛార్జ్ ప్లాన్‌ల కోసం చూస్తున్నట్లయితే జియో రూ. 296 రీఛార్జ్ ప్లాన్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో 30 రోజుల చెల్లుబాటు లభిస్తుంది. ఈ ప్లాన్‌లో మొత్తం 25 జీబీ డేటా అందుబాటులో ఉంది. అధిక వేగం డేటా పరిమితి ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64/kbpsకి తగ్గుతుంది. ఈ ఆఫర్ ప్రత్యేకత ఏమిటంటే మీరు ఎప్పుడైనా 25జీబీ డేటాను ఉపయోగించవచ్చు. అంటే ఇందులో ఒక్కరోజు పరిమితి లేదు.
ప్రయోజనాలు:
జియో ప్లాన్‌లో వాయిస్ కాలింగ్ కూడా అందుబాటులో ఉంది. జియో స్వంత యాప్‌లు JioTV, JioCinema, Jio క్లౌడ్, JioSecurity సబ్‌స్క్రిప్షన్ కూడా ప్లాన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు రోజుకు 1 జీబీ డేటాతో ప్లాన్ చేయకూడదనుకుంటే, జియో రూ. 296 ప్లాన్ మీకు ఉత్తమమైనది. ఎందుకంటే దీనిలో రోజువారీ పరిమితి లేదు. అలాగే, ఇది మొత్తం నెలకు రీఛార్జ్ ప్లాన్. జియో కస్టమర్లకు ఈ ప్లాన్ చాలా పొదుపుగా ఉండబోతోంది. మీరు మరింత డేటా అందుబాటులో ఉండే ఒక నెల రీఛార్జ్ ప్లాన్ కోసం కూడా చూస్తున్నట్లయితే ఈ ప్లాన్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి