
రిలయన్స్ జియో.. టెలికం రంగంలో ముందంజలో ఉంది. అత్యధికంగా కస్టమర్లు కలిగిన జియో.. ఎన్నో ఆఫర్లను వినియోగదారుల ముందుకు వస్తోంది. వివిధ రకాల ఆఫర్లను ప్రవేశపెట్టి తక్కువ రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి వస్తోంది. అలాగే జియో నుంచి కూడా ఫోన్‌లను విడుదల చేస్తోంది రియలన్స్. తాజా మరో చౌకైన ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జియో ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రతి సంవత్సరం రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కంపెనీ కొన్ని కొత్త ఉత్పత్తి లేదా మరొకటి ప్రకటిస్తుంది. రిలయన్స్ ఏజీఎం 2023కి ముందే ఈ సంవత్సరం జియో ఫోన్ 5Gకి సంబంధించి కంపెనీ పెద్ద ప్రకటన చేయవచ్చని చర్చ జరుగుతుంది. గత సంవత్సరం AGM 2022 నుంచి ఈ ఫోన్‌కు సంబంధించిన అనేక లీక్‌లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు రెండు కొత్త జియో మొబైల్ ఫోన్‌లు భారతీయ బీఐఎస్ ధృవీకరణ వెబ్‌సైట్‌లో గుర్తించబడ్డాయి. అలాగే కంపెనీ త్వరలో రెండు కొత్త హ్యాండ్‌సెట్‌లను విడుదల చేయనుందని ఇది స్పష్టమైన సూచన. మార్కెట్ ప్రారంభించవచ్చు.
టిప్‌స్టర్ ముకుల్ శర్మ మొదట బీఐఎస్ సర్టిఫికేషన్ సైట్‌లో జాబితా స్క్రీన్‌షాట్‌ను X (ట్విట్టర్)లో పోస్ట్ చేయడం ద్వారా షేర్ చేశాడు. రిలయన్స్ జియో ఈ రెండు రాబోయే మోడల్‌లు నోయిడాలో తయారు అయ్యాయి. ఈ జాబితా ద్వారా చాలా విషయాలు స్పష్టమయ్యాయి. జియో ఫోన్ 5G గత సంవత్సరం డిసెంబర్‌లో బీఐఎస్ ధృవీకరణ సైట్‌లో కనిపించింది. తాజా బీఐఎస్ లిస్టింగ్‌లో పేర్కొన్న రెండు ఫోన్‌ల మోడల్ నంబర్‌లు JBV161W1, JBV162W1. ప్రస్తుతానికి ఈ రెండు మోడల్‌లు కంపెనీ రాబోయే జియో ఫోన్ 5G రెండు వేరియంట్‌లకు చెందినవా లేదా కొత్త పరికరాలా అనే విషయం స్పష్టంగా తెలియలేదు.
New Jio phones receive the Indian BIS certification.#Jio pic.twitter.com/v23rbCgnvA
— Mukul Sharma (@stufflistings) August 11, 2023
రిలయన్స్ జియో ఈ సరసమైన 5జీ ఫోన్ అనేక చిత్రాలు ఇప్పటివరకు లీక్ అయ్యాయి. ఈ ఫోన్ ఈ నెలాఖరులోగా కంపెనీ ఏజీఎం 2023లో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఇది భారతదేశంలోనే అత్యంత చౌకైన 5G ఫోన్ అవుతుంది.
ఈ రాబోయే ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD ప్లస్ స్క్రీన్. అలాగే Snapdragon 480 చిప్‌సెట్ వేగం, మల్టీ టాస్కింగ్ కోసం ఉపయోగించవచ్చు. ఈ ఫోన్‌కు 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ, ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వవచ్చు. ఫోన్ వెనుక ప్యానెల్‌లో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి