AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముఖేష్‌ అంబానీ మాస్టర్‌ ప్లాన్‌.. జియో కోసం ఏకంగా 6 బ్యాంకులతో..!

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో మెగా ఐపీఓకు సిద్ధమవుతోంది. ఆరు బ్యాంకుల భాగస్వామ్యంతో జియో ప్లాట్‌ఫామ్స్ 170 బిలియన్ల విలువ అంచనాలతో భారత్‌లో అతిపెద్ద పబ్లిక్ ఆఫరింగ్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం ఐపీఓ నిబంధనలను సడలించడంతో ఈ ప్రక్రియ వేగవంతమైంది.

ముఖేష్‌ అంబానీ మాస్టర్‌ ప్లాన్‌.. జియో కోసం ఏకంగా 6 బ్యాంకులతో..!
Mukesh Ambani
SN Pasha
|

Updated on: Mar 17, 2026 | 1:16 AM

Share

ఆసియాలో అత్యంత ధనవంతులలో ఒకరైన ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ తన టెలికాం యూనిట్ జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌ కోసం మెగా ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్)కు పెద్ద ఎత్తున సన్నాహాలు ప్రారంభించింది. ఈ ప్రతిపాదిత షేర్ సేల్ కోసం కంపెనీ ఇప్పటికే ఆరు ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులతో కలిసి పని చేస్తోంది. ఈ ఐపీఓ ప్రక్రియలో బీఓఎఫ్ఏ సెక్యూరిటీస్, సిటీగ్రూప్ ఇంక్, గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్ ఇంక్, జేఎమ్ ఫైనాన్షియల్ లిమిటెడ్, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, మోర్గాన్ స్టాన్లీ వంటి ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అడ్వైజర్లుగా పనిచేస్తున్నాయని సమాచారం. భవిష్యత్తులో మరిన్ని అడ్వైజర్లు కూడా ఈ ప్రక్రియలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

బ్యాంకర్ల అంచనాల ప్రకారం జియో ప్లాట్‌ఫామ్‌ల మొత్తం వాల్యుయేషన్ సుమారు 170 బిలియన్ డాలర్స్ వరకు ఉండవచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారం కంపెనీ కనీసం 2.5 పర్సెంట్ ఈక్విటీ అమ్మితే, దాదాపు 4.3 బిలియన్ డాలర్స్ వరకు ఫండ్స్ రైజ్ చేయగలదు. తుది షరతులు ఖరారు అయిన తర్వాత కంపెనీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ఫైల్ చేసే ప్రక్రియను ప్రారంభించనుంది. లిస్టింగ్‌కు సంబంధించిన గవర్నమెంట్ రెగ్యులేషన్స్‌లో ఇటీవల చేసిన మార్పులు ఈ ఐపీఓకు మరింత వేగం తీసుకొచ్చాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

భారత ప్రైమరీ మార్కెట్ 2026లో కొంత నెమ్మదిగా ప్రారంభమైంది. డేటా ప్రకారం ఈ ఏడాది మొదటి క్వార్టర్ లో ఐపీఓల ద్వారా సుమారు 1.7 బిలియన్ డాలర్స్ మాత్రమే రైజ్ అయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఇది 2.3 బిలియన్ డాలర్స్ గా నమోదైంది. జియో ఐపీఓ విజయవంతమైతే, ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని మార్కెట్ అనలిస్టులు భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
వారం రోజుల్లో బంగారం ధర ఒకేసారి ఎంత పెరిగిందో తెలుసా..?
వారం రోజుల్లో బంగారం ధర ఒకేసారి ఎంత పెరిగిందో తెలుసా..?
జయం సినిమాలో కేకపుట్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
జయం సినిమాలో కేకపుట్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
మీ మొబైల్‌కు వచ్చే స్కామ్ కాల్ వెనుక ఎవరున్నారో తెలుసా..?
మీ మొబైల్‌కు వచ్చే స్కామ్ కాల్ వెనుక ఎవరున్నారో తెలుసా..?
ఆనందం ఆవిరైంది.. చెల్లి సీమంతం ముగిసిన మూడురోజులకే అన్న మృతి
ఆనందం ఆవిరైంది.. చెల్లి సీమంతం ముగిసిన మూడురోజులకే అన్న మృతి
మళ్లీ ఫుడ్‌ ట్రక్కులో దాక్కుంటారా? ట్రంప్‌కు ఇరాన్‌ చురక
మళ్లీ ఫుడ్‌ ట్రక్కులో దాక్కుంటారా? ట్రంప్‌కు ఇరాన్‌ చురక
TET పాసైన వారికి 6,534 విద్యా వాలంటీర్ ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
TET పాసైన వారికి 6,534 విద్యా వాలంటీర్ ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
రక్తం పెరగడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరగొద్దు.. ఇది చేర్చండి!
రక్తం పెరగడానికి హాస్పిటల్స్ చుట్టూ తిరగొద్దు.. ఇది చేర్చండి!
ఒక్క షేక్‌హ్యాండ్..మారిపోయిన సచిన్ జీవితం
ఒక్క షేక్‌హ్యాండ్..మారిపోయిన సచిన్ జీవితం
బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య!
బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య!
మీకు తెలియకుండా వీడియోలను రికార్డ్ చేస్తాయి.. జాగ్రత్త
మీకు తెలియకుండా వీడియోలను రికార్డ్ చేస్తాయి.. జాగ్రత్త