Jio New Prepaid Plans: టెలికాం రంగంలో రిలయన్స్ జియో దూసుకుపోతోంది. రోజుకో కొత్త ప్లాన్స్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక తాజాగా మొత్తం ఐదు కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్లతో ఒక సంవత్సరం పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ అందించనుంది జియో. వీటి ధర రూ.499 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్లాన్ల ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి బెనిఫిట్స్ లభించనున్నాయి.
రిలయన్స్ జియో ప్లాన్స్‌లో భాగంగా రూ.499 ద్వారా రీచార్జ్ చేసుకుంటే రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉండనున్నాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉండనుంది.
ఇక రూ.666 ప్లాన్‌ను కూడా జియో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ డేటా లభించనుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ లాభాలు కూడా అందించనున్నారు.
రూ.888 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. దీని ద్వారా రోజుకు 2 జీబీ డేటా అందుతుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్ బెనిఫిట్స్ ఉన్నాయి.
ఇక రూ.2,599 ప్లాన్ ద్వారా కూడా ఈ ఆఫర్ లభించనుంది. అయితే ఇది వార్షిక ప్లాన్. అంటే ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది. రోజుకు 2 జీబీ డేటా లభించనుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్ లాభాలు కూడా లభించనున్నాయి. అలాగూ సంవత్సరం పాటు డిస్నీ+ హాట్‌స్టార్ ఉచితంగా లభించనుంది.
రూ.549 కొత్త డేటా యాడ్-ఆన్ ప్లాన్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా రోజుకు 1.5 జీబీ డేటా లభించనుంది. ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది. మిగతా లాభాలేవీ లభించబోవడం లేదు. ఈ ప్లాన్లతో రీచార్జ్ చేసుకుంటే డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఉన్న ఇంగ్లిష్ షోలు, డిస్నీ, మార్వెల్, స్టార్‌వార్స్, నేషనల్ జియోగ్రఫిక్, హెచ్‌బీవో, ఎఫ్ఎక్స్, షోటైంలకు సంబంధించిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉచితంగా స్ట్రీమ్ చేయవచ్చు.
ఇక జియోఫోన్ నెక్స్ట్ ప్రీ-బుకింగ్స్ మనదేశంలో వచ్చేవారం నుంచి ప్రారంభం కానున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. రిలయన్స్ జియో, గూగుల్ భాగస్వామ్యంలో ఈ ఫోన్ తయారవుతోంది. ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో హెచ్‌డీ డిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్ ఉండనున్నాయని తెలుస్తోంది.
కాగా, ఈ ఫోన్ ధర గతంలోనే ఆన్‌లైన్‌లో లీకైంది. లీకుల ప్రకారం.. ఈ జియోఫోన్ నెక్స్ట్ ధర రూ.3,499గా ఉండనుంది. ప్రపంచంలో అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ ఇదేనని జియో గతంలోనే ప్రకటించింది. ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం… ఇందులో 5.5 అంగుళాల డిస్‌ప్లేను అందించనున్నట్లు సమాచారం. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720×1,440 పిక్సెల్స్‌గా ఉండనుంది. ఇందులో క్వాల్‌కాం క్యూఎం215 ప్రాసెసర్‌ను అందించారు. ఇది 64 బిట్ క్వాడ్‌కోర్ మొబైల్ ప్రాసెసర్.
అంతేకాకుండా.. ఫోన్ ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుందని తెలుస్తోంది. 16 జీబీ, 32 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో ఉండనున్నాయి. 4జీ వోల్టే, డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా ఇందులో ఉండనున్నాయి. తక్కువ ర్యామ్ ఉన్న ఫోన్లు ప్రభావవంతంగా పనిచేయడానికి డ్యుయోగో అనే ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు. ఇందులో గూగుల్ కెమెరా గో అనే ఫీచర్ కూడా ఉంది.
ఇందులో వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 2500 ఎంఏహెచ్‌గా ఉండే అవకాశం ఉంది. బ్లూటూత్ వీ4.2, జీపీఎస్, 1080పీ వీడియో రికార్డింగ్, ఎల్పీడీడీఆర్3 ర్యామ్, ఈఎంఎంసీ 4.5 స్టోరేజ్ వంటి సదుపాయాలు ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది.