జియో ఫోన్ వాడుతున్న వినియోగదారులకు ఆ కంపెనీ షాక్ ఇచ్చింది. రిఛార్జ్ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో జియో ఫోన్ ప్రీపెయిడ్ ప్రారంభ రీఛార్జ్ ప్లాన్‌లు గతంలో రూ.155, రూ.185, రూ.749 ఉండేవి ఇప్పుడు వాటి ధరల్ని 20శాతం పెంచింది జియో. రూ.155 రీఛార్జ్ ప్లాన్ రూ.186కి పెరిగ్గా.. రూ.185 ప్లాన్ రూ.222కి చేరింది. ఇక రూ.749 ప్లాన్ ప్రస్తుతం రూ.899తో అందుబాటులో ఉండనుంది. ఈ మూడు ధరల్ని పెంచినట్లు జియో సైతం తన అధికారిక వెబ్ సైట్‌లో పేర్కొంది. అయితే ఇది కేవలం జియో పోన్లు వాడుతున్నవారికే.. ఇతర కంపెనీల మొబైల్ ఫోన్‌లో జియో సిమ్ వాడుతున్నవారికి ఈ పెంపు వర్తించదు. జియో ఫోన్ యూజర్లకు అందిస్తున్న రూ.186 బేసిక్ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో ప్రతి రోజు 1జీబీ డేటాను వస్తుంది. వాయిస్ కాల్స్ తో పాటు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా పంపవచ్చు.
రూ.222ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌లో యూజర్లు ప్రతిరోజు ఇంటర్నెట్ స్పీడ్ 64కేబీపీఎస్‌తో 2జీబీ డేటాను వస్తుంది. అదే విధంగా వాయిస్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు ఫ్రీగా వస్తాయి. రూ.899 ప్లాన్: 336రోజుల వ్యాలిడిటీతో 24జీబీ డేటాను వస్తుంది. రూ.186 ప్లాన్‌లో రోజుకు 1జీబీ డేటాను అందిస్తారు. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS ఫ్రీగా వస్తాయి.