JIO Fiber: తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోన్న జియో ఫైబర్‌ సేవలు.. కొత్తగా మరో 71 పట్టణాల్లో..

|

May 13, 2022 | 7:34 PM

JIO Fiber: జియో ఫైబర్‌ తన సేవలను మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రధాన పట్టణాల్లో జియో సేవలు అందుబాటులోకి రాగా తాజాగా మరో 71 పట్టణాల్లో జియో సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు...

JIO Fiber: తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోన్న జియో ఫైబర్‌ సేవలు.. కొత్తగా మరో 71 పట్టణాల్లో..
Representative Image
Follow us on

JIO Fiber: జియో ఫైబర్‌ తన సేవలను మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రధాన పట్టణాల్లో జియో సేవలు అందుబాటులోకి రాగా తాజాగా మరో 71 పట్టణాల్లో జియో సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక కరోనా నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ పెరగడం, విద్యార్థులు కూడా ఆన్‌లైన్‌లో విద్యనభ్యసిస్తుండంతో జియో ఫైబర్‌కు వినియోగదారుల నుంచి స్పందన కూడా బాగానే వచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీతో పాటు, తెలంగాణలోనూ జియో తన సేవలను విస్తరించింది.

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా విజయవాడ, విశాఖపట్నం వంటి ముఖ్యమైన నగరాలతో పాటు అనకాపల్లి, అనంతపురం, భీమవరం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, కడప, ధర్మవరం, ఏలూరు, గన్నవరం, గుడివాడ, గుంతకల్, గుంటూరు, హిందూపురం, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మదనపల్లె, నందిగామ, నంద్యాల, నరసారావుపేట, నెల్లూరు, నిడదవోలు, నూజివీడు, ఒంగోలు, పెద్దాపురం, పొన్నూరు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాళహస్తి, శ్రీకాకుళం, తాడేపల్లె, తాడేపల్లెగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, వినుకొండ, విజయనగరం, వుయ్యూరులు పట్టాణాల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి.

ఇక తెలంగాణ విషయానికొస్తే.. హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, బోధన్, భువనగిరి, హనుమకొండ, జగిత్యాల, జనగాం, కోదాడ, కొత్తగూడెం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మంచిర్యాల్, మేడ్చల్, మిర్యాలగూడ, మహేశ్వరం, నల్గొండ, నిజామాబాద్, రామగుండం, సంగారెడ్డి, షాద్‌నగర్, శంకర్‌పల్లి, సూర్యాపేట, తాండూర్, వనపర్తి, వరంగల్, జహీరాబాద్‌లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో మరో 7 పట్టణాలకు విస్తరించనున్నారు.

ఇవి కూడా చదవండి

కొత్త యూజర్లకు ప్రత్యేక ఆఫర్‌..

జియో ఫైబర్‌ నూతన పోస్ట్‌ పెయిడ్‌ యూజర్లకు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండానే లభిస్తుంది. జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకున్న వారికి రూ.10,000 విలువ కలిగిన ఇంటర్నెట్ బాక్స్ (గేట్ వే రూటర్), సెట్ టాప్ బాక్స్, ఇన్‌స్టాలేషన్‌లను ఉచితంగా పొందే అవకాశం కల్పించారు. ఇక దీంతో పాటు నెలకు రూ.399 ప్రారంభ ధరతో అపరిమిత హైస్పీడ్ ఇంటర్నెట్‌ను పొందొచ్చు. అలాగే నెలకు రూ.100 లేదా రూ.200 అదనంగా చెల్లించడం ద్వారా 14 ప్రముఖ ఓటీటీ యాప్‌లను ఉచితంగా యాక్సెస్‌ చేసుకోవచ్చు.