Recharge plans: ఎయిర్‌టెల్, జియో నుంచి కొత్త ప్లాన్‌.. ప్రైమ్‌తో పాటు మరెన్నో..

ఇక అక్కడితో ఆగని జియో ఎప్పటికప్పుడు యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు మంచి మంచి రీఛార్జ్‌ ప్యాక్‌లను పరిచయం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మరో ప్రముఖ టెలికం సంస్థ అయిన ఎయిర్‌టెల్‌ కూడా తమ యూజర్లను కోల్పోకూడదనే ఉద్దేశంతో రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ రెండు సంస్థలు రూ. 666 పేరుతో...

Recharge plans: ఎయిర్‌టెల్, జియో నుంచి కొత్త ప్లాన్‌.. ప్రైమ్‌తో పాటు మరెన్నో..
Recharge Plans

Updated on: Feb 18, 2024 | 8:21 AM

దేశ టెలికం రంగంలోకి జయో ఎంట్రీతో ఒక్కసారిగా పోటీ పెరిగిపోయింది. అప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్‌ని వెనక్కి నెట్టి జయో మొదటి స్థానంలకి దూసుకుపోయింది. తక్కువ ధరకే ఇంటర్‌నెట్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావడం, వేగవంతమైన ఇంటర్‌నెట్‌ను అందిండంతో జియో యూజర్లు ఒక్కసారిగా పెరిగిపోయారు.

ఇక అక్కడితో ఆగని జియో ఎప్పటికప్పుడు యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు మంచి మంచి రీఛార్జ్‌ ప్యాక్‌లను పరిచయం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మరో ప్రముఖ టెలికం సంస్థ అయిన ఎయిర్‌టెల్‌ కూడా తమ యూజర్లను కోల్పోకూడదనే ఉద్దేశంతో రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ రెండు సంస్థలు రూ. 666 పేరుతో కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ను పరిచయం చేసింది. ఇంతకీ ఈ రీఛార్జ్‌ ప్లాన్‌తో కలిగే ప్రయోజనాలు ఏంటి.? ఎలాంటి బెనిఫిట్స్‌ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

జియో రూ. 666 ప్లాన్‌ వివరాలు..

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే యూజర్లకు 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. అలాగే 84 రోజులకుగాను 126జీబీ డేటా అందిస్తుంది. రోజుకు 1.5జీబీ డేటాను ఉపయోగించవచ్చు. రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఉచితంగా పొందొచ్చు. వీటితో పాటు అదనంగా జియో టీవీ, జియో సినిమా, జియో సావన్‌ సబ్‌స్క్రిప్షన్‌లు ఉచితంగా పొందొచ్చు. ఇక 5జీ నెట్‌వర్క్‌ ఉన్న వారికి అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా పొందొచ్చు.

ఎయిర్‌టెల్‌ ప్లాన్‌..

ఎయిర్‌టెల్ ప్లాన్‌ విషయానికొస్తే ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే.. మొత్తంగా 115జీబీ డేటా. రోజుకు 1.5 జీబీ డేటా వాడుకోవచ్చు. అయితే ఇందులో 77 రోజులు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో ఉచితంగా పొందొచ్చు. అలాగే వింక్ మ్యూజిక్‌తోపాటు హలో ట్యూన్స్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..