ధనత్రయోదశి దగ్గర పడుతుండటంతో భారత్‌లో బంగారానికి ఫుల్ గిరాకీ పెరిగిపోయింది. దీంతో కస్టమర్లను ఎట్రాక్ట్ చేసేందుకు కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌లో ఆఫర్ చేస్తున్నాయి. అమ్మకాలను మరింత పెంచుకునేందుకు ఆన్‌లైన్‌లో వంద రూపాయలకే బంగారం అనే ఆఫర్‌ను పెడుతున్నాయి. నమ్మలేకపోతున్నారా..? అయితే ఈ స్టోరీ చూసేయండి మీకే అర్థమవుతుంది.
లాక్ డౌన్‌తో అన్ని మూతపడడంతో ఓ రకంగా ఆన్ లైన్ లో గోల్డ్ కొనే వినియోగదారులు పెరిగారు. ఈ క్రమంలోనే టాటా గ్రూప్‌కు చెందిన తనిష్క్, కళ్యాణ్ జ్యూయలర్స్ ఇండియా లిమిటెడ్, పీసీ జ్యూయలర్స్, సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి సంస్థలు ఆన్ లైన్ లో ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
కనీసం ఒక గ్రాము గోల్డ్ కొనుగోలు చేసే వినియోగదారులకు వందరూపాయలకే చేజిక్కించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే నేరుగా వెబ్‌సైట్ లేదా డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ సంస్థలు ఆన్‌లైన్ విక్రయాలు జరుపుతున్నాయి. అయితే, కనీసం ఒక గ్రామ్ బంగారానికి సరిపడా డబ్బు చెల్లించగానే హోమ్ డెలివరీ కూడా అందజేస్తున్నారు.
అయితే ఆగ్మోంట్ గోల్డ్ ఫర్ ఆల్, సేఫ్ గోల్డ్ వంటి సంస్థలు ఇప్పటికే ఆన్ లైన్ లో బంగారం అమ్మకాలు చేస్తున్నాయి. వాటితోపాటు కొన్ని ఫోన్ పే వంటి సంస్థలు (డిజిటల్ చెల్లింపుల సంస్థలు) ఇలా గోల్డ్ విక్రయిస్తున్నా.. మన దేశంలో మాత్రం కరోనా లాక్ డౌన్ తోనే ఆన్ లైన్ గోల్డ్ కు మంచి ఆదరణ పెరిగింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి తమ ప్లాట్ ఫాంలో కొనుగోళ్లు 200 శాతం పెరిగినట్లు కొన్ని సంస్థల ప్రతినిధులు తెలిపారు. ఎక్కువగా 3 వేల నుంచి రూ.4 వేల మధ్య ఉన్న గోల్డ్ కాయిన్లను కొనుగోలు చేసినట్లుగా వారు తెలిపారు. పండుగ సీజన్లలో ఆన్ లైన్ లో మరో 30 శాతం పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మన దేశంలో గోల్డ్‌కు ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటున్నారు బంగారం అమ్మకందారులు.
ఇవి కూడా చదవండి: Leopard Attack: చేతికర్రతో చిరుతను తరిమేసిన వృద్ధురాలు.. వీడియో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు..
Bhadrachalam Temple: అసలేం జరుగుతోంది రామా.. నీ ప్రసాదం కూడా మాయం చేస్తున్నారే..