ITR: మీరు ఆదాయపు పన్ను పరిధిలోకి రాకపోయినా.. టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయండి.. ప్రయోజనాలు ఏంటో తెలిస్తే..

|

Jun 06, 2023 | 6:33 PM

2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ 31 జూలై 2023లోపు దాఖలు చేయాలి. పన్ను పరిధిలోకి రాక పోవడం లేదా.. రెండున్నర లక్షల కంటే సంవత్సర ఆదాయం తక్కువగా ఉండటం వంటి కారణాలతో సాధారణంగా ఐటీ..

ITR: మీరు ఆదాయపు పన్ను పరిధిలోకి రాకపోయినా.. టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయండి.. ప్రయోజనాలు ఏంటో తెలిస్తే..
Income Tax Return
Follow us on

2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ 31 జూలై 2023లోపు దాఖలు చేయాలి. పన్ను పరిధిలోకి రాక పోవడం లేదా.. రెండున్నర లక్షల కంటే సంవత్సర ఆదాయం తక్కువగా ఉండటం వంటి కారణాలతో సాధారణంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే పనిలేదని అందరూ భావిస్తారు. కానీ.. అది అలా కాదు. మీరు ఆదాయపు పన్ను పరిధిలోకి రాకపోయినా, మీరు టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఎందుకంటే మీరు ఐటీఆర్‌ ఫైల్ చేస్తే మీకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల లోన్స్ పొందడం సులభం అవుతుంది. ఐటీఆర్‌ ఫైల్ చేయడం వల్ల కలిగే 5 ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఎలాంటి ప్రయోజనాలు

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం వలన ఈజీగా లోన్ పొందవచ్చు.. ఐటీఆర్‌ మీ ఆదాయానికి రుజువు. అన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు దీనిని ఆదాయ రుజువుగా అంగీకరిస్తాయి. మీరు బ్యాంకు లోన్ కోసం అప్లై చేసుకుంటే బ్యాంకులు కొన్నిసార్లు ఐటీఆర్ అడుగుతాయి. మీరు క్రమం తప్పకుండా ఐటీఆర్‌ ఫైల్ చేస్తే, మీరు బ్యాంకు నుంచి సులభంగా లోన్ పొందవచ్చు. ఇది కాకుండా, రుణాలు కాకుండా, మీరు ఏదైనా ఆర్థిక సంస్థ నుంచి ఆయన ఇతర సర్వీసులను కూడా సులభంగా పొందవచ్చు.

మీరు వేరే దేశానికి వెళుతున్నట్లయితే మీరు వీసా కోసం దరఖాస్తు చేసినప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్ కోసం మిమ్మల్ని అడగవచ్చు. అనేక దేశాల వీసా అధికారులు వీసా కోసం 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఐటీఆర్‌ అడుగుతారు. దీని ద్వారా వారు తమ దేశానికి రావాలనుకునే వ్యక్తి ఆర్థిక స్థితిని చెక్ చేస్తారు.

ఇవి కూడా చదవండి

మీ ఇన్ కామ్ నుంచి టాక్స్ కట్ అయి.. అది ప్రభుత్వానికి చేరి చేసినట్లయితే మీ ఆదాయం ఆదాయపు పన్నులో ప్రాథమిక మినహాయింపు పరిమితిలో ఉన్నప్పటికీ, మీరు ఐటీఆర్‌ ఫైల్ చేయకుండా దాన్ని తిరిగి పొందలేరు. మీరు పన్ను వాపసును క్లెయిమ్ చేయాలనుకుంటే ఐటీఆర్‌ ఫైల్ చేయడం అవసరం. మీరు ఫైల్ చేసినప్పుడు ఆదాయపు పన్ను శాఖ దానిని అంచనా వేస్తుంది. మీకు రీఫండ్ ఏదైనా ఉంటే అది నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

ఐటీఆర్‌ రసీదు మీరు నమోదు చేసిన చిరునామాకు వస్తుంది. ఇది చిరునామా రుజువుగా పని చేస్తుంది. ఇది కాకుండా ఇది మీకు ఆదాయ రుజువుగా కూడా పనిచేస్తుంది. మీరు షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి మీకు నష్టాన్ని కలిగి ఉంటే, ఆ నష్టాన్ని వచ్చే ఏడాదికి ఫార్వార్డ్ చేయడానికి నిర్ణీత గడువులోపు ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడం అవసరం. ఎందుకంటే వచ్చే ఏడాది మీకు మూలధన లాభం ఉన్నట్లయితే, ఈ నష్టం ఈ లాభంతో సర్దుబాటు అవుతుంది. మీరు లాభంపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.