ITR Extention: ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేవారికి గుడ్‌న్యూస్‌.. గడువు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..!

|

Jan 12, 2022 | 8:45 PM

ITR Extention: 2021-22 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్‌ దాఖలు చేసేందుకు గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT)నిర్ణయం..

ITR Extention: ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేవారికి గుడ్‌న్యూస్‌.. గడువు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..!
Follow us on

ITR Extention: 2021-22 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్‌ దాఖలు చేసేందుకు గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT)నిర్ణయం తీసుకుంది. రిటర్న్‌ దాఖలు చేసేందుకు మార్చి 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. కరోనా కారణంగా ఈ గడువును పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇది వరకు 2021 డిసెంబర్‌ 31తో ఐట రిటర్న్‌ దాఖలు చేయడానికి గడువు ఉండేది. మరో మారు గడువును పొడిగించేది లేదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ ప్రకటించారు. ఇప్పటి వరకకు2020-21 ఆర్థిక సంవత్సరానికి డిసెంబర్‌ 31 నాటికి సుమారు 5.89 కోట్ల ఐటి రిటర్న్‌ దాఖలు అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు డిసెంబర్‌ 31 నాటికి కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌లో ఒక్క రోజే 46.11 లక్షలకుపైగా మంది ఐటీఆర్‌లు దాఖలు చేసినట్లు సీబీడీటీ తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి గడువు 2021 జనవరి 10 నాటికి 5.95 కోట్ల ఐటి రిటర్న్‌లు దాఖలు అయినట్లు తెలిపింది. 2020 జనవరి 10 చివరి రోజు నాటికి 31.05 లక్షల ఐటీ రిటర్న్‌లు దాఖలు అయ్యాయి.

ఇంత‌కుముందు 2021 డిసెంబ‌ర్ 31తో ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయ‌డానికి తుది గ‌డువు అని పేర్కొన్న‌ది. చివ‌రి రోజు కూడా మ‌రోమారు ఐటీ రిట‌ర్న్స్ గ‌డువును పొడిగించేది లేద‌ని కేంద్ర రెవెన్యూశాఖ కార్య‌ద‌ర్శి త‌రుణ్ బ‌జాజ్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి డిసెంబ‌ర్ 31నాటికి సుమారు 5.89 కోట్ల ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌ల‌య్యాయి.

 

ఇవి కూడా చదవండి:

Edible Oil Prices: కేంద్రం గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన వంట నూనె ధరలు..!

Honda CB300R: హోండా నుంచి సరికొత్త బైక్‌ విడుదల.. ఫీచర్స్‌, ధర వివరాలు..!