Income Tax Raids: ఆరు రాష్ట్రాల్లో.. నాలుగు రోజులపాటు దాడులు..తనిఖీల్లో వెలుగు చూస్తున్న నిజాలు..

|

Oct 09, 2021 | 2:48 PM

ఆరు రాష్ట్రాల్లో.. నాలుగు రోజులపాటు.. ఏకకాలంలో జరిపిన సోదాల్లో కోట్లు పట్టుబడ్డాయి. బడా వ్యాపార సంస్థగా పేరొందిన ఫార్మా కంపెనీకి చెందిన కార్యాలయాలు, సంస్థ ప్రతినిధుల ఇళ్లలో చేసిన ఐటీ తనిఖీల్లో..

Income Tax Raids: ఆరు రాష్ట్రాల్లో.. నాలుగు రోజులపాటు దాడులు..తనిఖీల్లో వెలుగు చూస్తున్న నిజాలు..
It
Follow us on

ఆరు రాష్ట్రాల్లో.. నాలుగు రోజులపాటు.. ఏకకాలంలో జరిపిన సోదాల్లో కోట్లు పట్టుబడ్డాయి. బడా వ్యాపార సంస్థగా పేరొందిన ఫార్మా కంపెనీకి చెందిన కార్యాలయాలు, సంస్థ ప్రతినిధుల ఇళ్లలో చేసిన ఐటీ తనిఖీల్లో భారిగా అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు అధికారులు. హెటిరో సంస్థలపై ఆదాయపన్నుశాఖ అధికారులు చేసిన దాడుల్లో నమ్మలేని బయటపడ్డాయి. నాలుగు రోజులుగా హైదరాబాద్, విశాఖ, విజయవాడతో పాటు మరికొన్ని చోట్ల హెటిరో సంస్థ ఆఫీసులు, డైరెక్టర్లు, సీఈవోల ఇళ్లలో ఐటీ అధికారులు మెరుపుు దాడులు నిర్వహించారు. ఇందులో ఇప్పటి వరకూ రూ.142 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు…కంపెనీ డబ్బులతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. మొత్తం రాష్ట్రాల్లో యాభై చోట్ల సోదాలు నిర్వహించిన ఐటీ బృందాలు …16 బ్యాంక్‌ లాకర్లను గుర్తించారు. అందులో రూ.142 కోట్లు స్వాధీనం చేసుకోగా…మరో రూ. 550 కోట్ల రూపాయల నిల్వలకు సంబంధించి లెక్కలు దొరకలేదు.

ఐటీ అధికారులు హెటిరో సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా పసిగట్టిన ఆయా సంస్థ కొన్ని ఆధారాలను దొరకకుండా జాగ్రత్తపడ్డట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా పెన్‌డ్రైవ్‌లు, హర్డ్‌ డిస్క్‌లు, ఎలక్ట్రానిక్ డివైస్‌లను ధ్వంసం చేసినట్లుగా ఐటీ బృందాల తనిఖీల్లో బయటపడ్డాయి. ముఖ్యంగా కంపెనీకి చెందిన డేటాను తొలగించినట్లుగా తెలుస్తోంది.

ఇక అధికారుల తనిఖీల్లో హెటిరో సంస్థ అమెరికా, యూరప్, దుబాయ్, ఆఫ్రికా దేశాలకు భారీగా మందుల్ని ఎగుమతి చేసినట్లుగా తేల్చారు. నకిలీ ఇన్‌వాయిస్‌లను గుర్తించారు. ఈ రకంగా వచ్చిన డబ్బుతో భారీగా ఆస్తులు కూడబెట్టడంతో పాటు …పలు చోట్ల స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లుగా తేల్చారు. దొరికిన రూ.142 కోట్లే కాకుండా …మిగిలిన 550 కోట్ల రూపాయల నిల్వలపై కూపీ లాగుతున్నారు ఐటీ అధికారులు.

ఇవి కూడా చదవండి: Huzurabad By Election: మరింత హీటెక్కిన హుజురాబాద్.. రాజేందర్‌ పేరుతో నాలుగు నామినేషన్లు..

CM Jagan: ప్రధాని గారు.. విద్యుత్‌ ధరలపై చర్యలు తీసుకోండి.. మోడీకి లేఖ రాసిన సీఎం జగన్..

Facebook Apologised: అంతరాయానికి చింతిస్తున్నాం.. మరోసారి సారీ.. చెప్పిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్..

Beer: బీరు ప్రియులకు చేదువార్త.. 27 వేల 264 బాటిల్స్ బీరును పారబోసారు.. ఎందుకో తెలుసా..