LIC Share: ఎల్ఐసీ ఐపీవో మార్కెట్లోకి రాంగ్ టైమ్ లో వచ్చిందా..? కంపెనీ ఏమంటోందంటే..

|

Jun 15, 2022 | 7:45 PM

LIC Share: మార్కెట్లో ఇప్పుడు ఎవరిని కదిపినా ఎల్ఐసీ షేర్ గురించే చర్చ. వారిలో చాలా మంది అనుకుంటున్నది ఏమిటంటే.. ఎల్‌ఐసీ ఐపీఓ సమయం సరిగ్గా లేదా అన్నదే.

LIC Share: ఎల్ఐసీ ఐపీవో మార్కెట్లోకి రాంగ్ టైమ్ లో వచ్చిందా..? కంపెనీ ఏమంటోందంటే..
Lic Ipo
Follow us on

LIC Share: మార్కెట్లో ఇప్పుడు ఎవరిని కదిపినా ఎల్ఐసీ షేర్ గురించే చర్చ. వారిలో చాలా మంది అనుకుంటున్నది ఏమిటంటే.. ఎల్‌ఐసీ ఐపీవో సమయం సరిగ్గా లేదా అన్నదే. దేశంలోనే అతిపెద్ద IPOలో ఇన్వెస్ట్ చేసిన రిటైలర్ల మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. అయితే ఎల్‌ఐసీ ఛైర్మన్ ఎంఆర్ కుమార్ మాట్లాడుతూ.. సరైన ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరర్(ఎల్ఐసీ) స్టాక్ మార్కెట్‌ను ఎప్పుడూ మంచి లేదా చెడుగా చూడదన్నారు. ఐపీవో తీసుకురావడానికి ఇదే సరైన సమయమని అన్నారు. FY 2023లో ప్రభుత్వం LIC షేర్లను విక్రయించదని, వాటాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కంపెనీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తోందని వెళ్లడించారు.

కొత్త వ్యాపారాల విలువపై పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారని.. జూన్ చివరి నాటికి ఎంబెడెడ్ విలువను వెల్లడిస్తామని కుమార్ చెప్పారు. ఎల్‌ఐసీ బాగా క్యాపిటలైజ్ చేయబడిందని, రాబోయే 3-5 సంవత్సరాల్లో బీమా సంస్థ 15-16 శాతం VNB మార్జిన్‌ను సాధించగలదని తాను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. షేర్‌హోల్డర్లు, పాలసీదారులు, ఏజెంట్లకు విలువను సృష్టించేందుకు ఎల్ఐసీ చూస్తున్నట్లు స్పష్టం చేశారు. తన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వృద్ధి, లాభాల గరిష్ఠాలకు చేర్చడంపై దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు.

కంపెనీ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయబడినందున.. చాలా మంది వాటాదారులు ఉన్నారని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుమార్ అన్నారు. ఐపీవోలో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యులైన వారిలో చాలా మంది కంపెనీ పాలసీ దారులేనంటూ వారిని అభినందించారు. పాలసీ హోల్డర్లు కంపెనీపై విశ్వాసంతో ఉన్నారని ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేసిన వారికి సంపదను సృష్టించడంతో తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇందులో సవాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తామంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.

బుధవారం నాటికి ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ రూ.4.36 లక్షల కోట్లకు తగ్గింది. ఈ సమయంలో షేరు ధర రూ.690.45 వద్ద ముగిసింది. ఈ విధంగా స్టాక్ ఇష్యూ ధర అయిన రూ.949తో పోలిస్తే దాదాపు 27 శాతం పతనమైంది. లిస్టెడ్ కంపెనీగా మారటం వల్ల అనేక సావాళ్లు ఉంటాయని కుమార్ అన్నారు. ఒక ప్రశ్నకు బదులిస్తూ.. పాలసీ దారులు, ఇన్వెస్టర్ల మధ్య సమతుల్యత సాధించటం కొంత సవాలుతో కూడుకున్నదేనని అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో ఎలా ముందుకు సాగాలన్నదానిపైనై తాము దృష్టి సారించినట్లు తెలిపారు. అది పాలసీ హోల్డర్‌లు ఇష్టపడే వ్యాపారాల్లో అయినా లేదా వాటాదారులు ఇష్టపడే వ్యాపారాల్లో అయినా అని అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.