PIB: మహిళలకు కేంద్రం తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తోందా.? ఈ వార్తలో అసలు నిజం ఏంటంటే..

Updated on: Dec 07, 2022 | 9:58 AM

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే వార్తల్లో నిజమెంత ఉంటుందో అబద్ధః కూడా అంతే ఉంటుంది. తాజాగా అలాంటి ఫేక్‌ న్యూస్‌ నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఇంతకీ ఈ వార్తలో అసలు నిజమేంటో చెప్పే ప్రయత్నం చేసింది పీఐబీ...

1 / 5
సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత సమాచార మార్పిడి చాలా సులభతరమైంది. క్షణాల్లో సమాచారం అందరికీ అందుతోంది. అయితే నెట్టింట వైరల్‌ అయ్యే ఈ వార్తలన్నీ నిజమేనా.? అంటే కచ్చితంగా అవునని మాత్రం సమాధానం చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల పేరుతో కొన్ని వార్తలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

2 / 5
తాజాగా ఇలాంటి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నారీ శక్తి యోజన పథకం కింద దేశంలోని మహిళలకు రూ. 2.20 లక్షల రుణం ఇస్తోందనేది సదరు వార్త సారంశం. అయితే వైరల్‌ అవుతోన్న ఈ సమాచారంలో ఏమాత్రం నిజం లేదని అధికారులు స్పష్టం చేశారు.

3 / 5
ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఈ విషయమై క్లారిటే ఇచ్చే ప్రయత్నం చేసింది. 3) PIB ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్‌ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. 'ప్రధాన్ మంత్రి నారీ శక్తి యోజన' కింద కేంద్ర ప్రభుత్వం మహిళలందరికీ రూ. 2 లక్షల 20 వేలు ఇవ్వబోతోందని ఇండియన్ జాబ్ అనే యూట్యూబ్ ఛానెల్ పేర్కొంది.

4 / 5
ఈ వార్తలో ఎలాంటి నిజం లేదు' అని పేర్కొంది. ఇదిలా ఉంటే మీకు వచ్చిన సందేశాల్లో ఏమాత్రం అనుమానం కలిగిన దానిలో నిజమెంతో తెలుసుకోవడానికి పీఐబీ ఒక అవకాశాన్ని కల్పించింది.

5 / 5
ఇందు కోసం మీకు వచ్చిన మెసేజ్‌ను https://factcheck.pib.gov.in అకౌంట్‌కి మెసేజ్‌ చేయాలి లేదా +918799711259కి వాట్సాప్‌ కూడా చేయొచ్చు. అలాగే ఈమెయిల్ చేయాలనుకునేవారు pibfactcheck@gmail.com ఐడీకి పంపొచ్చు. ఇక ఫేక్‌ న్యూస్‌కు సంబంధించిన సమాచారం https://pib.gov.inలో కూడా అందుబాటులో ఉంది.