
Indian Currency: దేశంలో అవినీతిని అరికట్టడానికి, కరెన్సీ నోట్లకు సంబంధించిన మోసాలను నిరోధించడానికి ఆర్‌బిఐ అనేక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. దీనికోసం ఆర్బీఐ బ్యాంకు 100, 200 రూపాయల నోట్లను ప్రోత్సహించాలని, పెద్ద 2000 రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేయాలని నిర్ణయించింది. ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటంటే ఆర్బీఐ రూ. 500 నోటును నిలిపివేసే అవకాశం ఉంది.
దీనికి సంబంధించి బ్యాంకింగ్ నిపుణురాలు అశ్విని రాణా టీవీ9తో మాట్లాడుతూ.. మార్చి 2026 నాటికి ఆర్‌బిఐ రూ. 500 నోటును నిలిపివేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే డీమోనిటైజేషన్ లాగా ఈ నోట్లను అకస్మాత్తుగా ఆపాలని ఆర్‌బిఐ నిర్ణయించదని అన్నారు. బదులుగా, ముందుగానే వాటిని చెలామణి నుంచి ఆపడం ద్వారా మార్కెట్లో వాటి సంఖ్యను తగ్గించడం ద్వారా క్రమంగా ఆపివేయవచ్చు. దీనికోసం, బ్యాంకు 100, 200 రూపాయల నోట్ల ప్రసరణను పెంచవచ్చు. బ్యాంకుల ఏటీఎంలలో వాటి సంఖ్య పెరుగుతుంది. రూ.500 నోట్లను క్రమంగా మార్కెట్ నుండి ఉపసంహరించుకుని బ్యాంకుల్లో జమ చేస్తారు. ఈ ప్రక్రియ ఒక్క రోజులో పూర్తయ్యేది కాదు. కానీ ఆర్‌బిఐకి దీని కోసం ఒక ప్రణాళిక ఉంది. 2026 మార్చి నాటికి దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని బ్యాంకింగ్ నిపుణురాలు అప్రాయపడ్డారు.
RBI రూ.500 నోటును నిలిపివేయాలని నిర్ణయించుకుంటే నిపుణులు చెబుతున్నట్లుగా దీని వెనుక కారణం ఏమిటి? రిజర్వ్ బ్యాంక్ పెద్ద రూ. 500 నోటును ఎందుకు నిలిపివేయాలని ఆలోచిస్తోంది. దీనికి గల కారణాలు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: Bullet Train: భారత్‌కు బుల్లెట్ రైలు వచ్చేస్తోంది.. గంటకు 320 కి.మీ వేగం.. ఏ మార్గంలో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి