IRCTC Char Dham Yatra: యాత్రికులకు గుడ్‌న్యూస్‌.. ఐఆర్‌సీటీసీ కొత్త టూర్‌ ప్యాకేజీ.. పూర్తి వివరాలు

|

Jul 08, 2021 | 12:20 PM

IRCTC Char Dham Yatra: కరోనా మహమ్మారి కారణంగా యాత్రలను వాయిదా వేసుకున్న వారికి శుభవార్త. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) దేశంలోని..

IRCTC Char Dham Yatra: యాత్రికులకు గుడ్‌న్యూస్‌.. ఐఆర్‌సీటీసీ కొత్త టూర్‌ ప్యాకేజీ.. పూర్తి వివరాలు
Follow us on

IRCTC Char Dham Yatra: కరోనా మహమ్మారి కారణంగా యాత్రలను వాయిదా వేసుకున్న వారికి శుభవార్త. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను కలుపుతూ ‘చార్‌ధామ్‌ యాత్ర’ను ప్రకటించింది. దేఖో అప్నా దేశ్ కార్యక్రమంలో భాగంగా ఈ యాత్ర కొనసాగనుంది. డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్‌లో చార్‌ధామ్ యాత్ర చేయవచ్చు. ఈ యాత్రలో బద్రీనాథ్, పూరీ జగన్నాథ్, రామేశ్వరం, ద్వారకాదీశ్ ప్రాంతాలను ఒకే టూర్‌లో చూసే అవకాశం ఉంటుంది. బద్రీనాథ్‌లో బద్రీనాథ్ ఆలయం, నర్సింఘా ఆలయం, రిషికేషన్‌లో లక్ష్మణ్ ఝూలా, త్రివేణి ఘాట్, పూరీలో జగన్నాథ ఆలయం, గోల్డెన్ బీచ్, కోణార్క్ సూర్య దేవాలయం, చంద్రభాగా బీచ్, రామేశ్వరంలో రామనాథస్వామి ఆళయం, ధనుష్కోటి, ద్వారకలో ద్వారకాదీష్ ఆలయం, నాగేశ్వర్ జ్యోతిర్లింగ, శివ్‌రాజ్‌పూర్ బీచ్, బెట్ ద్వారక సందర్శించవచ్చు.

ఢిల్లీ నుంచి మొదలు..

ఐఆర్‌సీటీసీ ‘చార్‌ధామ్ యాత్ర’ ఢిల్లీలో మొదలవుతుంది. డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్‌ ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో సెప్టెంబర్ 18న బయలుదేరుతుంది. మొత్తం 15 రాత్రులు, 16 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తం 8500 కిలోమీటర్ల మేరకు ఆ యాత్ర కొనసాగనుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.78,585. సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీకి ప్యాకేజీ ధరలు వేర్వేరుగా ఉన్నాయి. టూర్ ప్యాకేజీలో ఫస్ట్ ఏసీ లేదా సెకండ్ ఏసీ క్లాస్‌లో ప్రయాణం, 6 రాత్రులు డీలక్స్ కేటగిరీ వసతి, 9 రాత్రులు రైలు కోచ్‌లోనే ప్రయాణం, రైలులోని రెస్టారెంట్ అందించే భోజనంతో పాటు పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లలో భోజనం, ఏసీ వాహనాల్లో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కూడా కవర్ అవుతాయి. ఈ యాత్ర ఎలా ఉంటుందనే దానిపై ఐఆర్‌సీటీసీ ఓ వీడియోను సైతం రూపొందించింది.

డీలక్స్‌ ఏసీ టూరిస్ట్‌ రైలులో..

డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలులో రెండు రెస్టారెంట్లు, అత్యాధునిక కిచెన్, షవర్ క్యూబికల్స్, సెన్సార్ బేస్డ్ వాష్‌రూమ్, ఫుట్ మసాజర్ లాంటి సౌకర్యాలు ఉంటాయి. రైలులో సీసీటీవీ కెమెరాలతో పాటు ప్రతీ కోచ్‌లో సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ఈ రైలులో 156 మంది టూరిస్టులు ప్రయాణించవచ్చు. కానీ కరోనా మహమ్మారి కారణంగా టూరిస్టుల సంఖ్యను 120 కి తగ్గించింది ఐఆర్‌సీటీసీ. కోవిడ్ 19 మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ఐఆర్‌సీటీసీ టూరిస్టులందరికీ ఫేస్ మాస్కులు, హ్యాండ్ గ్లోవ్స్, శానిటైజర్లను అందిస్తుంది. 18 ఏళ్లు పైబడినవారు ఐఆర్‌సీటీసీ చార్‌ధామ్ యాత్ర ప్యాకేజీ బుక్ చేయాలంటే కనీసం కోవిడ్ 19 వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకొని ఉండాలి. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఈ యాత్ర కొనసాగనుందని ఐఆర్‌సీటీసీ తెలిపింది.

 

ఇవీ కూడా చదవండి

RBI: ఎస్‌బీఐతో పాటు మరో 13 బ్యాంకులకు ఝలక్‌ ఇచ్చిన ఆర్బీఐ.. భారీగా జరిమానా విధింపు.. ఎందుకంటే..!

OnePlus Nord 2: వన్‌ప్లస్‌ నుంచి మరో కొత్త మొబైల్‌.. లీకైన విడుదల తేదీ.. స్పెసిఫికేషన్లు..!

Aadhaar Service: ఆధార్‌ కార్డు ఉన్న వారికి షాకింగ్‌ న్యూస్‌.. ఇకపై ఆ రెండు సర్వీసులు నిలిపివేత..!