IRCTC Down: భారతీయ రైల్వే ట్రైన్ టికెట్ బుక్ సర్వీస్ IRCTC సర్వర్ డౌన్ కావడం తో ప్రయాణికుల ఇక్కట్లు పడ్డారు. ఈనెల 26న ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సర్వర్ విఫలం కావడంతో ఈ సర్వీస్ పూర్తిగా డౌన్ అయ్యింది. దీని కారణంగా టికెట్ బుకింగ్ తో పాటు మరిన్ని సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్యతో ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్స్ బుకింగ్ కూడా చేయలేక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
రియల్ టైం ఔటేజ్ ఇన్ఫర్మేషన్ అందించే Downdetector ఈ విషయాన్ని వెల్లడించింది. IRCTC డౌన్ అయినట్లు అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందుకున్న ఈ సైట్ ఈ విషయాన్ని తెలిపింది. ఈ సమస్య ఉదయం 10 గంటల నుంచి మొదలు కాగా, 2500 లకు పైగా ఫిర్యాదులు అందినట్లు తెలిపింది. IRCTC వెబ్‌సైట్, అప్లికేషన్ డౌన్‌టైమ్‌ను ఎదుర్కొంటున్నప్పుడు రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి.
- ఏజెంట్ల ద్వారా టికెట్స్ బుకింగ్: ఇలా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ పని చేయనప్పుడు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇతర మార్గాల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. మీకు సమీపంలో ఉన్న IRCTC-అధీకృత టిక్కెట్ బుకింగ్ ఏజెంట్ లేదా ట్రావెల్ ఏజెన్సీని సంప్రదించండి. టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి అవసరమైన ప్రయాణ వివరాలను వారికి అందించండి. దీంతో వారి నుంచి మీరు రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
- రైల్వే స్టేషన్ కౌంటర్ల ద్వారా..: మీ దగ్గరలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌ని సందర్శించి, వ్యక్తిగతంగా మీ టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి రిజర్వేషన్ ఫారమ్‌ను పూరించండి. అక్కడ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
- థర్డ్-పార్టీ యాప్‌లు, వెబ్‌సైట్‌ల ద్వారా..: రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి విశ్వసనీయ థర్డ్-పార్టీ యాప్‌లు, వెబ్‌సైట్‌లను ఉపయోగించండి. వీటిలో Paytm, MakeMyTrip, RedBus వంటివి ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లు తరచుగా IRCTC సిస్టమ్‌తో లింక్ చేయబడి ఉంటాయి. టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఐఆర్‌సీటీసీ సర్వర్ డౌన్ అయినప్పుడు ఇలాంటి మార్గాల ద్వారా రైలు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
- 139కి కాల్ చేయండి (ఇండియన్ రైల్వే ఎంక్వైరీ): 139కి కాల్ చేయండి. ఇండియన్ రైల్వేస్ ఎంక్వైరీ, IVR లేదా ఏజెంట్ సహాయం ద్వారా రైలు టికెట్ల గురించి విచారించండి.
- పోస్టాఫీసు ద్వారా..: భారతదేశంలోని కొన్ని పోస్టాఫీసులు రైలు టికెట్ బుకింగ్ సౌకర్యాలను అందిస్తున్నాయి. మీ ఇంటికి సమీపంలోని పోస్టాఫీసును సందర్శించి, ఈ సేవను పొందండి.
- తత్కాల్, అత్యవసర కోటాలు: మీరు అత్యవసరంగా రైలులో ప్రయాణించవలసి వస్తే, తత్కాల్ పథకం కింద టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి లేదా స్టేషన్‌లో అత్యవసర కోటాల కోసం తనిఖీ చేయండి. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా టికెట్లను బుక్ చేసుకోవాలంటే గుర్తింపు పొందిన ఐడి తప్పకుండా ఉండాలి. అంటే ఏదైనా గుర్తింపు పత్రం తప్పనిసరి.
ఇది కూడా చదవండి: Anil Ambani: అనిల్ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా..? దాని విలువ ఎంతంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి