AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: పండుగ సీజన్‌లో రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే.. ఈ టిప్స్ పాటించండి

పండుగలు, వరుస సెలవుల సమయంలో సొంతూళ్లకు వెళ్లేందుకు రైళ్లను ఆశ్రయించే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. దీంతో రైలు టికెట్లకు డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. చివరి నిమిషంలో బుకింగ్ చేస్తే కన్ఫర్మ్ సీటు దొరకడం కష్టమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రైల్వే టికెట్లను 60 రోజుల ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉండటంతో, పండుగ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఈ సింపుల్ టిప్స్‌తో కన్ఫర్మ్ టికెట్ బుకింగ్ అయ్యే అవకాశాలు మెరుగుపడే అవకాశముంది.

Indian Railways: పండుగ సీజన్‌లో రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే.. ఈ టిప్స్ పాటించండి
IRCTC
Janardhan Veluru
|

Updated on: Sep 09, 2026 | 6:55 PM

Share

పండుగలు, వరుస సెలవులు వచ్చాయంటే సొంతూళ్లకు వెళ్లేందుకు చాలామంది రైళ్లను ఆశ్రయిస్తారు. దీంతో ఆ సమయంలో రైలు టికెట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. చివరి నిమిషంలో టికెట్ బుక్ చేసుకోవాలని ప్రయత్నిస్తే కన్ఫర్మ్ సీటు దొరకడం కష్టంగా మారే అవకాశముంది. అందుకే ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం రైల్వే టికెట్లను 60 రోజుల ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంది. పండుగ సీజన్‌లో టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండటంతో బుకింగ్ ప్రారంభమయ్యే సమయానికే సిద్ధంగా ఉండటం మంచిది.

బుకింగ్‌కు ముందే ఇలా సిద్ధం చేసుకోండి

టికెట్ బుకింగ్ ప్రారంభమయ్యే సమయానికి కొన్ని నిమిషాల ముందే IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ అవ్వడం ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయాణికుల పేరు, ఆధార్, వయసు వంటి వివరాలను ముందుగానే సిద్ధంగా ఉంచితే బుకింగ్ సమయంలో సమయం ఆదా అవుతుంది. అలాగే టికెట్ ధర చెల్లించేందుకు ఉపయోగించే పేమెంట్ విధానాన్ని కూడా ముందే నిర్ణయించుకోవాలి. ఒక పేమెంట్ ఆప్షన్‌లో సమస్య ఎదురైతే మరోదాన్ని ఉపయోగించుకునేలా సిద్ధంగా ఉండటం మంచిది. IRCTC వాలెట్‌ను ఉపయోగించేవారు అవసరమైన మొత్తాన్ని ముందుగానే అందులో ఉంచుకోవడం ద్వారా పేమెంట్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

OTP ఆలస్యం కాకుండా జాగ్రత్త

టికెట్ బుకింగ్ సమయంలో కొన్ని పేమెంట్ విధానాల్లో OTP రావడానికి ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. పండుగ సీజన్‌లో సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున కొన్ని నిమిషాల ఆలస్యం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశముంది. అందువల్ల వేగంగా పనిచేసే పేమెంట్ ఆప్షన్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది.

ముందస్తు ప్లానింగ్‌ కీలకం

పండుగ సీజన్‌లో రైలు ప్రయాణం చేయాలనుకునేవారు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే తేదీలను నిర్ణయించుకోవాలి. బుకింగ్ ప్రారంభమయ్యే సమయానికి లాగిన్ అయి, ప్రయాణికుల వివరాలు సిద్ధంగా ఉంచి, పేమెంట్ విధానాన్ని ముందే ఎంచుకోవడం ద్వారా టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేసుకోవచ్చు.

గమనిక: ఈ చర్యలతో టికెట్ కన్ఫర్మ్ అవుతుందని హామీ లేదు.. అయితే బుకింగ్ సమయంలో ఆలస్యాన్ని తగ్గించుకుని, టికెట్ కన్ఫర్మ్ అవకాశాన్ని పెంచుకునేందుకు ఈ టిప్స్ సహాయపడే అవకాశముంది.

Follow Us
పండుగ సీజన్‌లో రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే.. ఈ టిప్స్ పాటించండి
పండుగ సీజన్‌లో రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలంటే.. ఈ టిప్స్ పాటించండి
ఆ హీరోయిన్‌ నాకు అక్కలాంటిది.. ఆమె అకాల మరణం చాలా బాధేసింది
ఆ హీరోయిన్‌ నాకు అక్కలాంటిది.. ఆమె అకాల మరణం చాలా బాధేసింది
ట్రంప్‌లో ఊహించని కొత్త యాంగిల్.. స్టాఫ్ కు నజరానా !
ట్రంప్‌లో ఊహించని కొత్త యాంగిల్.. స్టాఫ్ కు నజరానా !
మరిగించిన పాలను ఫ్రిడ్జ్‌లో పెట్టినా పాడవుతున్నాయా?పొరపాట్లు ఇవే!
మరిగించిన పాలను ఫ్రిడ్జ్‌లో పెట్టినా పాడవుతున్నాయా?పొరపాట్లు ఇవే!
భారత్ అధ్యక్షతలో కీలక నిర్ణయాలకు రంగం సిద్ధం.. ఇదిగో షెడ్యూల్!
భారత్ అధ్యక్షతలో కీలక నిర్ణయాలకు రంగం సిద్ధం.. ఇదిగో షెడ్యూల్!
20 ఏళ్ల తర్వాత తొలిసారి.. చెత్త రికార్డులో పాకిస్తాన్ దూకుడు
20 ఏళ్ల తర్వాత తొలిసారి.. చెత్త రికార్డులో పాకిస్తాన్ దూకుడు
పురుషులు జేబులో దువ్వెన పెట్టుకోవడం వెనుక ఇన్ని కారణాలా?
పురుషులు జేబులో దువ్వెన పెట్టుకోవడం వెనుక ఇన్ని కారణాలా?
ఈ రెండు వస్తువులతో.. కరివేపాకు మొక్క గుబురుగా పెరుగుతుంది పక్కా
ఈ రెండు వస్తువులతో.. కరివేపాకు మొక్క గుబురుగా పెరుగుతుంది పక్కా
ఈ ఆకులు గుప్పెడు ఉంటే చాలు.. చుండ్రు మాయం!
ఈ ఆకులు గుప్పెడు ఉంటే చాలు.. చుండ్రు మాయం!
ఆవిర్లు వస్తున్న టీ తాగుతున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు!
ఆవిర్లు వస్తున్న టీ తాగుతున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు!